విజయ్ ఫ్యాన్స్ చేసిన ఈ పనికి, మన హీరోలకి ఆశపుడుతోంది

తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ విడుదల సమయం దగ్గరపడింది. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈచిత్రం యొక్క ప్రీ బుకింగ్స్ సార్ట్ అయ్యాయి. అంతేకాదు ఈ సినిమాకు మొదటి రోజు భారీగా సంఖ్యలో షోస్‌ వేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. చెన్నైలోని పలు థియేరట్లలో 48 గంటల పాటు కంటిన్యూస్‌గా షోస్‌ వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈచిత్రం తమిళ సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ప్రపంచ వ్యాప్తంగా 3400 స్క్రీన్లలో సందడి చేయనుంది. ఇదే సమయంలో కేరళకు చెందిన కొల్లం నన్బన్‌‌ ఫ్యాన్‌ క్లబ్‌ సభ్యులు తమ అభిమాన హీరో కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 175 అడుగుల భారీ కటౌట్‌ను రూపొందించారు. దీనిని మలయాళ నటుడు సన్నీ వెయిన్‌ శనివారం లాంచ్ చేసారు. ఇప్పటివరకు ఏ సినీ హీరోకీ ఇంత భారీ కటౌట్‌ను అభిమానులు రూపొందించకపోవటంతో ఇదో రికార్డ్ గా మారింది.

మరో ప్రక్క  ఈచిత్రం మొదటి రోజు రికార్డు వసూళ్లను సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క తమిళనాడులోనే ఈ చిత్రం మొదటి రోజు 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. మరో వైపు ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలవుతోంది. ఏ.ఆర్‌ మురుగదాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇందులో విజయ్‌కు జంటగా కీర్తి సురేశ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌ తొలిసారి ముఖ్యమంత్రి పాత్రలో కన్పించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కానుంది.