కొంతకాలం క్రితం ఆ స్టార్ హీరో వైఫ్ సోషల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండేవారు. నిరంతరం ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ చెబుతూ .. యోగా ధ్యానం సహా మంచి ఆహారపు అలవాట్ల గురించి .. ఆధ్యాత్మిక వ్యవహారాల గురించి ముచ్చటించేవారు. నిరంతరం ఏదో ఒక సామాజిక సేవ గురించో లేక మంచి పని గురించో పోస్టింగులు పెట్టేవారు. పనిలో పనిగా తమ హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీల బిజినెస్ ని ప్రమోట్ చేస్తుండేవారు. అయితే ఉన్నట్టుండి సడెన్ గా అవన్నీ స్టాప్ చేసేశారు ఎందుకనో!!
దానికి కారణం ఏమై ఉంటుంది? అన్నది ఆరా తీస్తే షాకింగ్ విషయమే తెలిసింది. ఇటీవల కరోనా వైరస్ మహమ్మారీ వేళ నెటిజనుల నుంచి తనకు ఊహించని ప్రశ్న ఎదురైంది. హెల్త్ రంగంలో ఉన్నారు మీరు.. అసలే ప్రజలు కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ కి బలై ఆర్థిక భారాన్ని మోయలేక చితికిపోతున్నారు. అలాంటి వారికి మీరు ఉచితంగా మందులు సరఫరా చేయొచ్చు కదా? అలా ఎందుకని చేయరు? మీ వ్యాపారాల వృద్ధి గురించి తప్ప ఇంకేదీ పట్టదా? అందుకేనా ఇన్నాళ్లు హెల్త్ టిప్స్ చెప్పారు? అంటూ నిలదీసే ప్రయత్నం చేశారట.
దీంతో సదరు స్టార్ వైఫ్ టోటల్ సోషల్ మీడియా యాక్టివిటీస్ బంద్ చేశారంటూ ఓ గుసగుస ఫిలంనగర్ సర్కిల్స్ లో హీటెక్కిస్తోంది. అయితే ఆ నెటిజన్ వ్యాఖ్య సరైనదే కానీ.. ఆస్పత్రులు మెడికల్ షాపులతో సంపాదించుకునేందుకు దొరికిన ఏకైక ఆప్షన్ ని వదులుకునేందుకు కార్పొరెట్ ఎప్పుడూ అంగీకరించదన్న నగ్న సత్యాన్ని ఎందుకని గ్రహించడం లేదు? అంటూ మరికొందరు ప్రశ్నించడం హాట్ డిబేట్ గా మారింది. దీనికి ఎవరి నుంచి ఎలాంటి ఆన్సర్ లేదు మరి.