హాస్య‌న‌టుడు వేణుమాధ‌వ్ మొద‌టి జీతం ఎంత‌?

న‌టుడు వేణుమాధ‌వ్ గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసిన దానికంటే తెలియ‌నిదే చాలా ఎక్కువ‌. ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం.. ఉద్యోగం .. వ్య‌క్తిత్వం గురించి తెలిసింది త‌క్కువ‌. స‌హ‌ న‌టుడు ఉత్తేజ్ ఓ ఇంట‌ర్వ్యూలో వేణుమాధ‌వ్ దాన‌గుణం గురించి చెప్పిన వివ‌రాలు గుండెల్ని ట‌చ్ చేశాయి. ఓసారి ఒక న‌టుడు షూటింగ్ లొకేష‌న్ కి వ‌చ్చి తాను క‌ష్టంలో ఉన్నాన‌ని ఆర్థిక సాయం కావాల‌ని వేణుమాధ‌వ్ ని అడిగాడ‌ట‌. దానికి అత‌డు స్పందించిన తీరు ఆస‌క్తిక‌రం. దానికి స్పందించిన అత‌డు డ‌బ్బు తీసి ఇస్తాడ‌ని అనుకుంటే.. వెంట‌నే త‌న కార్ ద‌గ్గ‌రికి వెళ్లి డ‌బ్బు ద‌స్కం ఇస్తే రెండు రోజుల్లో తాగి తగిలేస్తావ్… ఆ త‌ర్వాత‌ పిల్లల పరిస్థితి ఏమ‌వుతుందో ఆలోచించావా? అందుకే రెండు క్వింటాల బియ్యం, రెండు నెలలకు సరిపడే పప్పు, ఉప్పులు సాయం చేశాడ‌ట‌.

వేణుమాధ‌వ్ మొద‌టి జీతం ఎక్క‌డ ఎంత అందుకున్నాడు? అన్న‌దానికి అత‌డే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌రాల్ని అందించాడు. 1996 టైమ్ లో మిమిక్రీ ఆర్టిస్టుగా త‌న‌కు అంతో ఇంతో ప్ర‌తిభ ఉంది. ఆ క్ర‌మంలోనే తేదేపా అధినేత‌ నంద‌మూరి తార‌క‌రామారావు  ఆఫీస్ లో ఉద్యోగంలో చేరాడు. నెల‌కు 600 జీతం అందుకున్నాడు. అయితే త‌ర్వాత రియ‌లైజ్ అయ్యి మిమిక్రీ ఆర్టిస్టుగా త‌న‌కు ఎంతో భ‌విష్య‌త్ ఉంద‌ని భావించి ఆ దిశ‌గా ట్రై చేశాడ‌ట‌. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి క‌ళ్ల‌లో ప‌డ‌డంతో సంప్ర‌దాయం అనే చిత్రంలో అవ‌కాశం అందుకున్నాడు. ఆ త‌ర్వాత వేణుమాధ‌వ్ కెరీర్ తెలిసిందే.

హాస్య న‌టుడు వేణుమాధ‌వ్ అనారోగ్యానికి చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. నేడు హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ వ‌ద్ద 2గం.ల స‌మ‌యంలో ఆయ‌న పార్థీవ‌దేహాన్ని అభిమానుల సంద‌ర్భ‌నార్థం ఉంచుతారు. ఆ త‌ర్వాత మౌలాలీలో ఆయ‌న అంతిమ సంస్కారాలు పూర్తి చేయ‌నున్నారు.