బిగ్ బాస్ సీజ‌న్ 4లో  హీటెక్కించే హాట్ గాళ్స్

                                            ఈసారి బిగ్ బాస్ హాట్ హాట్‌గా

బిగ్ బాస్ – తెలుగు మూడు సీజ‌న్లు పూర్త‌య్యాయి. ఎన్టీఆర్ హోస్ట్ గా తొలి సీజ‌న్.. నాని హోస్ట్ గా మ‌లి సీజ‌న్.. నాగార్జున హోస్ట్ గా మూడో సీజ‌న్ విజ‌య‌వంతం అయ్యాయి. ముఖ్యంగా మూడో సీజ‌న్ నిర్వాహ‌కుల‌కు బిగ్ బూస్ట్ ఇచ్చింద‌నే చెప్పాలి. సీజ‌న్ ప్రారంభానికి ముందే కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు బిగ్ బాస్ 3 సీజ‌న్ కి బోలెడంత ప్ర‌చారం తెచ్చి పెట్టింది.

అయితే బిగ్ బాస్ సీజ‌న్ 4 సంగ‌తేమిటి?  హోస్ట్ ఎవ‌రు?  పార్టిసిపెంట్స్ ఎవ‌రెవ‌రు? అన్న‌దానికి ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన క్లూ లేదు. ఇటీవ‌లే ఈసారి బిగ్ బాస్ ఇంట్లో బిత్తిరి స‌త్తి హ‌డావుడి ఉంటుంద‌ని తెలిసింది. అతడు ప్ర‌ముఖ వార్తా చానెల్ నుంచి ఎగ్జిట్ అవ్వ‌డంతో బిగ్ బాస్ 4లో ప్ర‌వేశించే అవ‌కాశం ల‌భించింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

తాజాగా ఇదే ఇంట్లో మ‌రో ఐదారుగురు అంద‌గ‌త్తెల ట్రీట్ ఉంటుంద‌ని తెలిసింది. వీళ్ల‌లో శ్ర‌ద్ధా దాస్, హంసా నందిని, యామిని భాస్క‌ర్, మోనా, ప్రియా వ‌డ్ల మాని పేర్లు వినిపిస్తున్నాయి. శ్ర‌ద్ధా దాస్ చాలా కాలంగా టాలీవుడ్ లో రాణించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా ఆశించిన స‌క్సెస్ ద‌క్క‌లేదు. బిగ్ రేంజ్ ఛాన్సుల్లేవ్. దీంతో ఐటెమ్ గాళ్ గా.. గ్రేడ్ 2 సినిమాల తార‌గా ఫిక్స‌య్యింది. తెలుగ‌మ్మాయిల్లో యామిని భాస్క‌ర్, ప్రియా వ‌డ్ల‌మాని ప్ర‌తిభ ఉన్నా చిన్న రేంజ్ సినిమాల‌కే అంకిత‌మ‌య్యారు. హంసానందిని హీటెక్కించే కంటెంట్ ఉంటే కానీ ఆఫ‌ర్ త‌న‌ప‌రం కావ‌డం లేదు. మొత్తానికి వీళ్లంతా బిగ్ బాస్ హౌస్ లో అగ్గి రాజేసేందుకు బ‌రిలో దిగుతున్నార‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. న‌లుగురైదుగురు క‌థానాయిక‌ల‌తో మొత్తానికి ఈసారి సీజ‌న్ మాత్రం రంజుగా నే ప్లాన్ చేస్తున్నార‌ని భావించాల్సి ఉంటుంది.