‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’రిలీజ్ పై ..హై కోర్ట్ తీర్పు వచ్చేసింది

లక్ష్మిస్ ఎన్టీఆర్ విడుదలను ఆపటం కుదరదు..భావ స్వేచ్ఛ విషయంలో మేము కలగజేసుకోలేమని తేల్చి చెప్పింది కోర్ట్ ..ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ఆనందంతో సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. ఈ సినిమా విషయమై ఈసీకి ఫిర్యాదు చేసి విడుదలను ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపాలని కోరారు కొందరు టీడీపీ కార్యకర్తలు. కానీ ఎలెక్షన్ కమిషన్ సినిమా విడుదల ఆపడం కుదరదని తేల్చి చెప్పింది. ఇప్పుడు హైకోర్టులో కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి ఊరట లభించింది.

ఎన్టీఆర్‌ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఇప్పటికే సంచలనాలకు కేంద్ర బింధువుగా మారిన ఈ సినిమాని మార్చి 29న విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించారు.

మరో ప్రక్క ప్రమోషన్‌ విషయంలో వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసందే. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రంకు సంబంధించి మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.

ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ తెరకెక్కించిన బయోపిక్‌లో చూపించని ఎన్నో ఈ నిజాలు ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆడియన్స్‌.