కరోనా కల్లోలం అందరికీ పుష్కలంగా సెలవులిచ్చింది. ఆఫీస్ యజమాని మొరాయింపుతో పని లేకుండా ప్రతి ఉద్యోగి సెలవు మీద ఊళ్లకెళ్లారు. ఇంట్లో కుటుంబాలతో సుదీర్ఘ సమయాన్ని గడుపుతున్నారు. లాక్ డౌన్ వేళ ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా బంధాలు అనుబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే వంటింట్లో గరిటె తిప్పడం దగ్గర నుంచి బాత్రూములు కడగడం ఇల్లు ఊడ్వడం వగైరా వగైరా చేస్తూ అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు.
అయితే ఇదిగో ఈ హీరోయిన్ మాత్రం వీళ్లందరి కంటే చాలా డిఫరెంట్. అందరిలా రొటీన్ గా ఉండడం ఇష్టం లేదు తనకు. అందుకే ఈ క్వారంటైన్ టైమ్ ని ఇలా పొలానికి అంకితమై పని చేస్తోంది. వ్యవసాయం చేసేందుకు ఏమాత్రం నామోషీ ఫీలవ్వలేదు. చీర కట్టు పైకి ఎగ్గట్టి మరీ పొలంలో నాట్లు వేస్తూ ఒక సాధారణ కూలీనే తలపించింది. అంతేనా ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నిన వీడియోలు తన ఇన్ స్టాలో వేడెక్కించేస్తున్నాయి. ఇలా చేయాలంటే స్కిల్ అవసరం. బాత్రూమ్ కడిగినంత ఈజీ అయితే కానే కాదు. వ్యవసాయం అన్నది నైపుణ్యం ఉంటేనే చేయగలిగేది.
ఆ స్కిల్ తనకు ఉందని నిరూపించిన సదరు హీరోయిన్ పేరు కీర్తి పాండియన్. నటుడు రాజకీయ నాయకుడు అరుణ్ పాండియన్ కుమార్తె. డాడీకి ఊళ్లో పొలం ఉంది. ఆయన పొలం చేసేవారు. ఇప్పుడు తనకు టైమ్ వచ్చింది. ఓవైపు మలయాళ చిత్రసీమలో నటవృత్తిలో కొనసాగుతూనే అక్కడ సక్సెసైనా అవ్వకపోయినా తనకు పొలం పనిలోనూ రాణించగలనని ప్రూవ్ చేస్తోంది. కీర్తి ఇప్పటికే తుంబ అనే సినిమాలో నటించి పరిశ్రమ వర్గాల్ని ఆకట్టుకుంది. అటుపై వరుసగా అవకాశాలొస్తున్నాయి. ప్రస్తుతం మలయాళ హిట్ చిత్రం విలన్ ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. అందులో నాన్నగారు అరుణ్ తో కలిసి కీర్తి నటిస్తోంది. కీర్తి గట్స్ చూసి యూత్ కాస్తయనా సిగ్గు తెచ్చుకోవాలేమో! పొలం పనికి నామోషీ ఫీలయ్యేవాళ్లందరికీ ఇది చక్కని లెస్సన్ అని చెప్పాలి.