మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు నో చెప్పేవాళ్లు ఇండస్ట్రీలో ఉంటారా…అంటే కొన్ని సందర్బాల్లో అనే సమాధానం వస్తోంది. గత కొద్ది రోజులుగా ఆయన తమ గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేసేందుకు హీరోల కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఒక్కరు కూడా సెట్ కాలేదని తెలుస్తోంది. అందుకు కారణం ఆయన ప్రపోజ్ చేస్తున్న డైరక్టర్ అని తెలుస్తోంది. ఆ డైరక్టర్ మరెవరో కాదు..
హీరోలకు సాధారణంగా..హిట్ డైరక్టర్ అంటే ఉన్న మోజు…ప్లాఫ్ డైరక్టర్స్ పై ఉండదు. ముఖ్యంగా కెరీర్ బిల్డప్ ..హిట్ మీద ఆధారపడిన ఈ రోజుల్లో మరింత జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు హీరోలు. ఈ నేపధ్యంలో ప్లాఫ్ కాకుండా డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ కు సినిమా ఓకే అవ్వటం అంటే మాటలు కాదు. ఇప్పుడు అదే పరిస్దితి శ్రీకాంత్ అడ్డాలది. గత కొద్ది రోజులుగా శ్రీకాంత్ అడ్డాల కొత్త చిత్రం మొదలు కానుందంటూ వార్తలు మీడియాలో వస్తున్నాయి. అయితే ఏ హీరోతో సినిమా చెయ్యబోతున్నాడో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఈ నేపధ్యంలో శర్వానంద్ ..శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ కాబోతోందంటూ వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తలో నిజం లేదని తెలుస్తోంది. ఏ హీరో కూడా ఇప్పటివరకూ శ్రీకాంత్ అడ్డాల ప్రాజెక్టు ఓకే చెయ్యలేదు. గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్ద వెనక ఉన్నా కూడా వర్కవుట్ కావటం లేదు. శ్రీకాంత్ అడ్డాల అనగానే డేట్స్ ఖాళీ లేవు అని చెప్తున్నారు. దాంతో అల్లు అరవింద్ కూడా ఖంగు తింటున్నారట. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక తల పట్టుకుంటున్నారని తెలుస్తోంది.