అవార్డులంటే హీరోల‌కు అస‌హ్య‌మా?

క‌ళాబంధులో అంత ఆవేద‌న ఎందుకు?

అవార్డు కార్య‌క్ర‌మాల ప్ర‌హ‌స‌నం గురించి తెలిసిందే. అవార్డుల్ని కొనుక్కుంటార‌ని లేదూ క‌మిటీతో లాలూచీలు న‌డిపిస్తార‌ని నెగెటివ్ టాక్ ఉంది. చాలా అవార్డుల్లో జ‌రిగేది ఇదేన‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. అందుకేనేమో ఇటీవ‌ల అవార్డుల‌కు విలువ తగ్గింది. కార్పొరెట్ రాక‌తో అవార్డులే అవార్డులు కావ‌డంతో ఇది త‌ట్టుకోలేని ప‌రిస్థితి ఉందిప్పుడు. కార‌ణం ఏదైనా అవార్డు కార్య‌క్ర‌మాల‌కు రావాలంటే మ‌న స్టార్ హీరోలు ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేదు.

టీఎస్సార్‌ పిలిస్తే అవార్డుల‌కు రాన‌న్నారు!

అయితే ఉన్న‌ట్టుండి హీరోల అనాస‌క్తిపై సీనియ‌ర్ నిర్మాత, క‌ళాబంధు టి.సుబ్బ‌రామిరెడ్డి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆరోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ పిలిస్తే గౌర‌వంగా వ‌చ్చి అవార్డులు తీసుకునేవారు. కానీ ఇప్ప‌టి హీరోలు అలా లేరు. అవార్డుల‌కు పిలిస్తే రావ‌డం లేదు ఎందుక‌నో అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అన్న‌ట్టు ఆయ‌న ఎవ‌రిని ఉద్ధేశించి అన్నారో కానీ ఆ స్టార్లు ఎవ‌రు? అంటూ టాలీవుడ్ లో చ‌ర్చ సాగుతోంది. ఈ నెల 17న విశాఖ న‌గ‌రంలో జ‌ర‌గనున్న త‌న బ‌ర్త్ డే కార్య‌క్రమాల్లో స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌కు `అభిన‌య మయూరి` అనే అవార్డును ఇస్తున్నారు టీఎస్సార్. అందుకే ఆయ‌న‌ను క‌ళాబంధు అని పిలిచేది. ఎంతో ధ‌నం వెచ్చించి ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల‌కు ఇవ్వ‌డం ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లింది. పాపం పిలిచినా మ‌న హీరోలు ఎందుక‌ని అవార్డులు అందుకునేందుకు రావ‌డం లేదో..ప్చ్!!