టాలీవుడ్ హంక్ రానా భళ్లాలునిగా మైమరిపించాడు. బాహుబలి చిత్రంలో అతడి మాకో లుక్.. ఫిజిక్ చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందమైన గాళ్స్ వీరాభిమానులయ్యారు. అయితే అతడు మాత్రం ఇటీవల ఒకరిని తనకు కాబేయే భార్యగా ఎంపిక చేసుకున్నారు. తన మనసుకు నచ్చిన మిహీకా బజాజ్‌కు ప్రపోజ్ చేశానని రానా స్వయంగా సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. ఫోటోని రివీల్ చేశారు. అటుపై మిహీక ఎవరు? అంటూ ఆరాలు మొదలయ్యాయి. అంతలోనే దగ్గుబాటి కుటుంబం- మిహీక ఫ్యామిలీ మే 21 న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో రోఖా వేడుకను నిర్వహించారు. ఆ వేడుక ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
దగ్గుబాటి వెడ్డింగ్ ఆగస్టు 8న జరగనుంది. ఈ వివాహానికి సంబంధించిన ప్రణాళికల్లో ఇరు కుటుంబాలు బిజీ. కుటుంబ సభ్యులు ఇప్పటికే వివాహ వేదికను ఖరారు చేశారని తాజాగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని ప్రసిద్ధ ఫలక్‌నుమా ప్యాలెస్ లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట వివాహం జరుగుతుంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
ఫలక్ నుమా ప్యాలెస్ ఎక్కడ అంటే.. పరిచయం అవసరం లేదు. ఓల్డ్ సిటీ పరిసరాల్లో వైభవంగా ఉండే పురాతన ఆర్కిటెక్చర్ తో కూడుకున్న ప్యాలెస్ ఇది. కొంతకాలం క్రితం సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహం జరిపి విందు ఇక్కడే ఏర్పాటు చేశారు. తమిళ హీరో ఆర్య- సయేషా సైగల్ జంట తమ వివాహానికి ఆతిథ్యం ఈ వేదిక వద్దనే ఇచ్చింది. ఇప్పుడు అదే వెన్యూలో రానా వెడ్డింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పదేళ్ల స్నేహం అనంతరం రానా -మిహీక మధ్య బంధం ప్రేమగా మారింది. ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్లాడేస్తున్నారు.