ఓకే జానర్ లో నటించడం నాకు నచ్చదు.. రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

దగ్గుబాటి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా నుంచి ఎన్నో విభిన్న కథలను ఎంపిక చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నటుడు రానా తాజాగా మరో విభిన్న కథాంశంతో తెరకెక్కిన విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకి ఎప్పుడు ఒకే విధమైన జానర్ సినిమాలలో నటించడం ఇష్టం ఉండదని తెలిపారు. ఒకసారి. ఒక జానార్ లో చేసిన సినిమాలను మళ్ళీ రిపీట్ చేయడం తనకు నచ్చదని తెలిపారు. అలాగే ఒక మంచి కథను చెప్పాలంటే హీరోగా మాత్రమే చెప్పాల్సిన పని లేదని, బలమైన పాత్రల ద్వారా కూడా సినిమా కథను ప్రేక్షకులకు చూపించవచ్చు అని తెలిపారు.విరాట పర్వం సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో తాను రవన్న పాత్రలో కనిపిస్తానని తెలిపారు.

ఈ సినిమా కథ విన్నప్పుడు తనకు కలిగిన అనుభూతిని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ఒక లోతైన సముద్రంలోకి మనల్ని తోస్తే కలిగే అనుభూతి ఎలా ఉంటుందో, ఈ సినిమా కథ వేణు చెబుతున్నప్పుడు తనకు అలాంటి అనుభూతి కలిగిందని ఈ సందర్భంగా రానా విరాట పర్వం సినిమా గురించి తెలిపారు. ఇకపోతే ఈ సినిమాని రానా తన సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మించారు. ఇందులో సాయిపల్లవి వెన్నెల పాత్రలో నటించగా నటుడు నవీన్ చంద్ర, ప్రియమణి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ విధంగా రానా ఈ సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.