రానా పెళ్లిలో స‌మంత జంత‌ర్ మంత‌ర్ లుక్

                                                 రానా పెళ్లిలో రామ చిల‌క‌మ్మ‌

రానా-మిహీక జంట పెళ్లికి ఇంకో ఇర‌వై నాలుగు గంట‌లే అడ్డు. ఆగ‌స్టు 8 దివ్య‌మైన ముహూర్తం ఫిక్స్ చేసి ఆ రోజు కోసం ద‌గ్గుబాటి కుటుంబం బ‌జాజ్ కుటుంబం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నాయి. ప్ర‌స్తుతం పెళ్లి సంబ‌రాలు మిన్నంటుతున్నాయి. బుధ‌వారం నాడు హ‌ల్దీ వేడుక‌.. అయ్యింది. గురువారం సాయంత్రం మెహందీ వేడుక‌ను కానిచ్చేశారు. ఈరోజు వ‌దిలేస్తే రేప‌టితో రానా బ్యాచిల‌ర్ లైఫ్ ని వ‌దిలేసి మూడు ముళ్ల బంధంతో ఓ ఇంటివాడైన‌ట్టే.

అయితే అంత‌కుముందే మెహందీ సంబ‌రాల్లో బంధుమిత్రుల సంద‌డి హాట్ టాపిక్ గా మారింది. అందునా అందాల స‌మంత లుక్ హాట్ టాపిగ్గా మారింది. సామ్ ప‌సుపు రంగు డిజైన‌ర్ లుక్ లో అద‌ర‌గొట్టింది. అందుకు సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టా మాధ్య‌మం ద్వారా అభిమానుల‌కు షేర్ చేసింది. ఇప్ప‌టికే రానా- మిహీక బ‌జాజ్ హ‌ల్దీ వేడుక ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.  

రానా పెళ్లికి రామానాయుడు స్టూడియోస్ వేదిక కానుంది. ఈ పెళ్లికి అతిథులుగా ప్ర‌భాస్- రాజ‌మౌళి స‌హా రామ్ చ‌ర‌ణ్ – శ‌ర్వానంద్ త‌దిత‌ర స్నేహితులు అటెండ‌య్యేందుకు అవ‌కాశం ఉంద‌ట‌. ఇక ఎలానూ క‌జిన్స్ కాబ‌ట్టి నాగ‌చైత‌న్య – స‌మంత జంట సంద‌డికి హ‌ద్దే ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదు.

సామ్ డిజైన‌ర్ లుక్ ప్ర‌స్తుతం యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. లైట్ మేక‌ప్ తో మ‌త్తెక్కించే రూపంతో మాయ చేస్తోంది జెస్సీ. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ గా షేర్ అవుతున్నాయి.