“జీవితంలో మర్చిపోలేని ఆనందం “- నాని

“జీవితంలో మర్చిపోలేని ఆనందం “- నాని

73వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ను హీరో నాని ఆవిష్కరించారు . హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . స్కూల్ పిల్లలలు, కల్చరల్ సెంటర్ సభ్యులు అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు . ఈ సందర్భంగా నాని జాతీయ జెండా ను ఆవిష్కరించారు . నాని మాట్లాడుతూ .. “ఈ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చెయ్యమని అధ్యక్షులు డాక్టర్ కే. ఎల్ . నారాయణ గారు ఆహ్వానించారు . అంతా పెద్ద వాళ్ళు వుంటారు అనుకున్నాను , తీరా ఇక్కడికి వచ్చాక స్కూల్ పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం చూసి చాలా సంతోషం అనిపించింది . నాకు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి “అన్నారు .

“ఆగస్టు 15 , జనవరి 26న జరిగే జెండా పండుగ అంటే చిన్నప్పుడు ఉత్సాహంగా పాల్గొనేవాడిని . ఈరోజు వేడుకలో నేను జెండాను ఆవిష్కరిస్తానని అనుకోలేదు . మొదటిసారి జాతీయ జెండాను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా అనిపించింది . ఇంత మంది చిన్న పిల్లల మధ్య లో … నేను కూడా చిన్నవాడినై పోతే బాగుండు అనిపించింది” అని ఆనందంగా చెప్పాడు నాని . కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు కె.ఎల్ నారాయణ మాట్లాడుతూ .. 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నాని పాల్గొనడం మా అందరికీ ఎంతో సంతోషంగా వుంది , మా కల్చరల్ సెంటర్ పక్కనే వున్న స్కూల్ ను దత్తత చేసుకొని వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు .

ఈ కార్యక్రమంలో 200 మంది చిన్నారులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు . అంతే కాదు స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రాధాన్యత గురించి చిన్న పిల్లలు అద్భుతంగా మాట్లాడారు . నాని చిన్న పిల్లతో కలసి పోయి వారితో ఫోటోలు తీయించుకున్నారు . ఈరోజు తన జీవితంలో మరపురాని రోజని నాని ఈ సందర్భంగా చెప్పారు . కార్యక్రమంలో తుమ్మల రంగారావు , రాజ శేఖర్ రెడ్డి , జెమినీ కిరణ్, ఆదిశేషగిరి రావు ,గిరి బాబు , మోహన్ ముళ్ళపూడి , కిషోర్ , శివారెడ్డి , భగీరథ , కాజా సూర్యనారాయణ , సురేష్ కొండేటి మొదలైనవారు పాల్గొన్నారు .