ఆ సింగర్‌కు భార్య అంటే ఎంత ప్రేమో!

Hema Chandra Special Wishes To Sravana Bhargavi

టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో సింగర్ హేమచంద్ర-శ్రావణ భార్గవిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమ, వివాహాంతో ఒక్కటయ్యారు. సింగర్లుగా ఇద్దరూ బిజీగా ఉన్న తరుణంలోనే పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. పలు వేదికల్లో ఇద్దరూ కలిసి పాటలు పాడారు. ప్రత్యేకంగా ప్రోగ్రాంలు కూడా చేసేవారు. ఇక సోషల్ మీడియాలో ఈ జంట చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే.

Hema Chandra Special Wishes To Sravana Bhargavi
Hema Chandra Special Wishes To Sravana Bhargavi

2013లో పెళ్లి పీఠలెక్కిన ఈ జంటకు.. శిఖర చంద్రిక అనే ఓ ముద్దుల కూతురు కూడా ఉంది. ఈ ముగ్గురు సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. బిడ్డతో కలిసి హేమచంద్ర చేసే అల్లరిని శ్రావణ భార్గవి నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక నిన్న శ్రావణ భార్గవి బర్త్ డే (ఆగస్ట్ 16). ఈ సందర్భంగా హేమచంద్ర భార్యపై ప్రేమను కురిపించాడు. పాత జ్ఞాపకాలన్నంటిని బయటకు తీశాడు.

శ్రావణ భార్గవితో మొదటగా జరిగిన పరిచయం నుంచి గతేడాది బర్త్ డే వరకు జరిగిన మూమెంట్స్‌ను అందరితో పంచుకున్నాడు. మొదటి సారి కలిశాక వచ్చిన బర్త్ డేను ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారో.. అప్పుడు ఆమెను తీసిన ఫోటోను కూడా షేర్ చేశాడు. ఇక ప్రతీ ఏడాది బర్త్ డేను ఎలా సెలెబ్రేట్ చేశాడో చెప్పుకొచ్చాడు. పాప పుట్టాక ఎలా జరుపుకున్నారో చెబుతూ.. చివరగా ఈ ఏడాది విషెస్‌ను చెబుతూ సర్ ప్రైజ్ చేశాడు. మొదటి ఫోటోను గుర్తు పెట్టుకున్నాడంటే.. హేమచంద్రకు తన భార్య అంటే ఎంత ఇష్టమో అర్థమవుతోంది.