శ్రావణ భార్గవికి తిరుపతిలోకి నో ఎంట్రీ ?

శ్రావణ భార్గవి అన్నమయ్య కీర్తనల వీడియో రోజుకో వివాదాన్ని సృష్టిస్తుంది. అన్నమయ్య కీర్తనలలో ఒకటైన ఒకపరికొకరి వయ్యారమే అనే పాట పాడుతూ ఈమె పాటలో నటించింది. అయితే ఈ పాట పై చాలా మంది విమర్శలు చేయడమే కాకుండా తనపై తిరుపతిలో కేసు కూడా ఫైల్ కావడంతో శ్రావణ భార్గవి ఓ మెట్టు వెనక్కు తగ్గి ఈ పాటలో చాలా వరకు మార్పులు చేసింది. అయితే పాట విషయంలో వెనక్కి తగ్గినప్పటికీ ఈమెకు వివాదం తప్పలేదు.

ఈ క్రమంలోనే ఈ పాట విషయంపై తిరుపతి వాసులు స్పందిస్తూ శ్రావణ భార్గవి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య కీర్తనలను ఇలా తన అందాలను చూపించడం కోసం ఉపయోగించిందని ఇలా స్వామివారి కీర్తనలను ఉపయోగించడంతో తిరుపతి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్వామి వారి కీర్తనలను తన స్వలాభం కోసం ఉపయోగించిన శ్రావణ భార్గవిని తిరుపతిలోకి రానివ్వమంటూ తిరుపతివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భవిష్యత్తులో స్వామివారి దర్శనం కోసం తిరుపతి రాకూడదని అడుగుపెట్టిన తనని ఇక్కడి వరకు రానివ్వమని తిరుపతి వాసులు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధంగా శ్రావణ భార్గవి పై తిరుపతి వాసులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా శ్రావణ భార్గవి బహిరంగంగా అన్నమయ్య వంశీకులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈమె స్వామి వారి కీర్తనలను ఇలా ఉపయోగించుకోవడం పట్ల ఇప్పటివరకు టీటీడీ అధికారులు ఏమాత్రం స్పందించలేదు. ఈ క్రమంలోనే టీటీడీ అధికారులు స్పందించి తనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఏది ఏమైనా శ్రావణ భార్గవి గత కొన్ని రోజుల నుంచి ఇలాంటి వివాదాలలో చిక్కుకొని పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.