‘24 కిస్సెస్‌’కథ, టాక్: హిట్టా..ఫట్టా?

‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌.ఎక్స్‌.100’ చిత్రాల‌తో తెలుగు తెరపై ముద్దులకు చాలా పాపులారిటి వచ్చింది. ఈ నేఫధ్యంలో టైటిల్ లోనే ముద్దులున్న ‘24 కిస్సెస్‌’టీజర్,ట్రైలర్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. మరో ప్రక్క‘మిణుగురులు’తో అవార్డ్ పొంది త‌న ప్ర‌తిభ‌ని నిరూపించుకున్న అయోధ్య‌కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కావ‌డంతో సినిమాపై కూడా అంచ‌నాలున్నాయి. ఈ నేఫధ్యంలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…

ఈ చిత్రం కథ చిల్డ్రన్ ఫిల్మ్ లు తీసే దర్శకుడు చుట్టూ తిరుగుతుంది. అతనిక అమ్మాయిలతో శారీరక సంభందం సైతం ఇష్టపడతాడు కానీ ప్రేమ,పెళ్లి అంటే మాత్రం దూరం అంటూంటాడు. ఏదన్నా అంటే ఇలా మనం హ్యాపీగా ఉండలేమా..నీకో సగం..నాకో సగం..ఇదో ప్రేమోత్సవం అంటూ పాటలు పాడతాడు.అతనితో మాస్ క‌మ్యూనికేష‌న్ స్టూడెంట్ శ్రీల‌క్ష్మి (హెబ్బా ప‌టేల్‌)తో ప్రేమ‌లో ప‌డ‌ుతుంది. ఆ త‌ర్వాత ఇద్ద‌రి ఇద్దరూ దగ్గర అవుతారు. అప్పుడు ఆమె..పెళ్ళి చేసుకుందాం అంటుంది. అయితే అసలు నేను ప్రేమే వద్దంటూంటే..నువ్వు పెళ్లి అంటావేంటి అని కోప్పడతాడు. దాంతో ఆమె అతన్ని దూరం పెడుతుంది. ఇలా కథ .ప్రేమ,పెళ్లి, రిలేషన్ షిప్ ల మధ్య జరుగుతూంటుంది.

ఇక ఈ సినిమా చూసినవాళ్లు ఇదో చెత్త సినిమాగా తేల్చేస్తున్నారు. సినిమాలో కేవలం ముద్దులు తప్ప మరేమీ లేదవని,అర్దం పర్దం లేని కథ,స్క్రీన్ ప్లే తో విసిగించారని అంటున్నారు. ఉన్న ఆ ముద్దులు కూడా రసాస్వాదన కలిగించేలా లేవని యూత్ కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి తోడు బోర్ కొట్టేలా సామాజిక సందేశం అనే ట్యాగ్ తగిలించాలని దర్శకుడు ప్రయత్నించాడని విసుక్కుంటున్నారు. టోటల్ ఇదో విఫల ప్రయత్నం..డిజాస్టర్ సినిమా అని ముద్ర వేసేస్తున్నారు.