పెళ్లాడ‌కుండానే త‌ల్లిని చేసిన ప్లేబోయ్

టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా పెళ్లికి ముందే తండ్రిగా ప్ర‌మోట‌య్యాడు. త‌న‌కు కాబోయే భార్య న‌టాసా స్టాంకోవిక్ గర్భవతి. ఈ విష‌యాన్ని హార్థిక్ స్వ‌యంగా ఇన్ స్టా మాధ్య‌మం ద్వారా ప్ర‌క‌టించాడు. హార్థిక్ వినిపించిన గుడ్ న్యూస్ కి టీమిండియా ఆట‌గాళ్లు బాలీవుడ్ ప్ర‌ముఖుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది.

టీమిండియా ఆట‌గాళ్ల‌లో ముందుగా విరాట్ కోహ్లీ స్పందించి శుభాకాంక్ష‌లు తెలిపాడు. చావ‌ల్, మ‌యాంక్ అగ‌ర్వాల్, మ‌హ‌మ్మ‌ద్ స‌మీ స‌హా కోచ్ ర‌విశాస్త్రి హార్థిక్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు. బాలీవుడ్ స్టార్ల‌లో సునీల్ శెట్టి హార్థిక్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే సునీల్ శెట్టి కుమార్తె హార్థిక్ స్నేహితుడు టీమిండియా ఆట‌గాడు రెహానేని ప్రేమిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా హార్థిక్ త‌న భార్య బేబి బంప్ ఫోటోల్ని ఇన్ స్టా మాధ్య‌మంలో పోస్ట్ చేశారు. ఇక 2020 జ‌న‌వ‌రిలో హార్థిక్- న‌టాసా స్టాంకోవిక్ జంట నిశ్చితార్థం పూర్త‌యింది. త‌ర్వ‌లోనే పెళ్లికి ముహూర్తం నిర్ణ‌యించనున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌హమ్మారీ సీజ‌న్ పెళ్లిళ్ల‌కు పెద్ద ఆటంకంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈలోగానే ఈ లాక్ డౌన్ ని హార్థిక్ స‌ద్వినియోగం చేసుకున్నాడంటూ ఫ్యాన్స్ బోలెడ‌న్ని పంచ్ లు వేస్తున్నారు సోష‌ల్ మీడియాలో.