క్రేజీ పోస్ట్ : “ఆదిపురుష్” కోసం తమ భారీ సినిమా అప్డేట్ ఆపుకున్న దర్శకుడు..!

ఇప్పుడు మన తెలుగు సినిమా నుంచే ఎక్కువ పాన్ ఇండియా లెవెల్ చిత్రాలు అందులోని మంచి కాన్సెప్ట్ లతో వస్తున్నాయని చెప్పాలి. అలా ఇపుడు అయితే మన టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నుంచి అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ కాంబోలో “ఆదిపురుష్” అనే నెక్స్ట్ లెవెల్ విజువల్ వండర్ ని రెడీ చేశారు.

అలాగే ఈ దసరా కానుకగా ఈ బిగ్ ప్రాజెక్ట్ అప్డేట్ ని కూడా లాక్ చేసి సిద్ధంగా ఉంచారు. అయితే మన టాలీవుడ్ నుంచి రైజ్ అవుతూ కొత్త జానర్స్ సినిమాలు చేస్తూ వస్తున్న ఫిలిం మేకర్ ప్రశాంత్ వర్మ. తన అ! సినిమా జాంబీ రెడ్డి వరకు వినూత్న సినిమాలు చేసి ఇప్పుడు “హనుమాన్” అనే ఓ బిగ్గెస్ట్ సూపర్ హీరో సినిమాని హాలీవుడ్ లెవెల్ స్టాండర్డ్స్ తో చేస్తున్నాడు.

యంగ్ హీరో తేజ సజ్జ చేస్తున్న ఈ సినిమా విషయంలో దర్శకుడు ఇప్పుడు క్రేజీ పోస్ట్ ని అందించాడు. ఈ దసరా కానుకగా అయితే తాము తమ హనుమాన్ అప్డేట్ ని ప్లాన్ చేశామని కానీ ఆరోజు ఏకంగా రాముడే వస్తుండడంతో మా అప్డేట్ వాయిదా వేసుకున్నామని తెలిపాడు.

తర్వాత మంచి సమయంలో రిలీజ్ చేస్తామని తెలిపాడు. అంతే కాకుండా ఇప్పుడు అయితే నేను కూడా ప్రభాస్ గారి ఆదిపురుష్ ట్రీట్ కోసమే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఇలా రాముడి కోసం తమ హనుమాన్ ని అందాకా నిలుపుకోవడం విశేషంగా మారింది.