థియేట‌ర్ యాజ‌మాన్యం షాక్ తినేలా ప్ర‌భుత్వ‌ నిర్ణ‌యం

                                  ఆగ‌స్టు నుంచి థియేట‌ర్లు తెరిస్తే జ‌నం వ‌స్తారా?

ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారీ అట్టుడికిస్తున్న సంగ‌తి తెలిసిందే. భార‌త‌దేశంలో ప‌రిస్థితి దారుణంగా ఉందిప్పుడు. ఇలాంటి స‌మ‌యంలో ఈ ప్ర‌క‌ట‌నతో థియేట‌ర్ యాజ‌మాన్య‌మే షాక్ తిన‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను ఆగస్టులో తిరిగి తెరవడానికి అనుమతించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ అండ్ బి) కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఆ మేర‌కు తాజాగా స‌మాచార ప్ర‌సారాల శాఖ కార్యదర్శి అమిత్ ఖరే అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌డం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం సిఐఐ మీడియా కమిటీతో పరిశ్రమల సంభాషణలో ఖ‌రే ఈ విషయాన్ని సూచించారు. హోం మంత్రిత్వ శాఖలో త‌న కొలీగ్ అయిన‌‌ అజయ్ భల్లా తుది నిర్ణ‌యం తీసుకుంటారని ఆయన చెప్పారు.

ఆగస్టు ఒక‌టి నాటికి లేదా ఆగస్టు 31 నాటికి సినిమా హాళ్ళను భారతదేశం అంతటా తిరిగి తెరవడానికి అనుమతించాలని తాను సిఫార్సు చేశానని ఖరే చెప్పారు. ఆయ‌న కొన్ని సూచ‌న‌లు కూడా చూశార‌ట‌. థియేట‌ర్ల‌లో మొదటి వరుసలో ప్రత్యామ్నాయ సీట్లు ఏర్పాటు చేయాల‌ని.. తరువాత వరుసను ఖాళీగా ఉంచేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. దేశం అంతటా ఈ పద్ధతిలో కొనసాగడం క్షేమ‌క‌రం అని తెలిపారు.

స‌మాచార మంత్రిత్వ శాఖ సిఫారసు ప్ర‌కారం.. రెండు మీటర్ల సామాజిక దూర ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకోవాల‌ని .. అయితే దానిని బదులుగా రెండు గజాల దూరానికి సీట్లు సర్దుబాటు చేయొచ్చ‌ని సూచించార‌ట‌. అయితే ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌పై హోం మంత్రిత్వ శాఖ సిఫారసు ఏమిటో చూడాల్సి ఉంది.

అయితే ఐ అండ్ బి ఇంటరాక్షన్‌లో పాల్గొన్న చాలా మంది ఈ ప్ర‌తిపాద‌న‌ల్ని వ్య‌తిరేకించారు. ఈ ఫార్ములా తెలివి తక్కువదని, కేవలం 25 శాతం ఆడిటోరియం సామర్థ్యంతో సినిమాలు నడపడం థియేట‌ర్ల‌ను మూత వేయ‌డం కంటే దారుణమైన ప‌ని అని వ్యాఖ్యానించ‌డం హాట్ టాపిక్ గా మారింది.

సమావేశానికి హాజరైన వారిలో ఎన్.పి. వంటి మీడియా సంస్థ‌ల‌ సీఈఓలు ఉన్నారు. సోనీకి చెందిన సింగ్, సామ్ బల్సర (మాడిసన్), మేఘా టాటా, (డిస్కవరీ), గౌరవ్ గాంధీ (అమెజాన్ ప్రైమ్), మనీష్ మహేశ్వరి (ట్విట్టర్), ఎస్. శివకుమార్ (బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్), మరియు కె. మాధవన్, స్టార్ & డిస్నీ స‌హా సీఐఐ మీడియా కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.