పవన్ ఫ్యాన్స్ చేసిన పనికి అందరూ షాకయ్యారు !

Pawan Kalyan fans shocks everyone with their work
Pawan Kalyan fans shocks everyone with their work
స్టార్ హీరోల అభిమానుల టాలెంట్ చూసి షాకవుతున్నారు నెటిజన్లు, సినిమా వాళ్ళు. తమ హీరో కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఏమాత్రం ఆలస్యమైనా అభిమానులే స్వయంగా వాటిని రూపొందించి సోషల్ మీడియాలో వదులుతున్నారు.
 
ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు అఫీషియల్ పోస్టర్లను తలదన్నేలా ఉంటున్నాయి.  తాజాగా ఇలాంటి పోస్టర్ ఒకదాన్నే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రూపొందించారు. పవన్ కళ్యాణ్ సైన్ చేసిన సినిమాల్లో హరీష్ శంకర్ సినిమా కూడ ఉంది. ఆగష్టు నెలలో చిత్రం మొదలుకానుంది. ఈ సినిమా మీద ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ‘గబ్బర్ సింగ్’ లాంటి హిట్ మరోసారి రిపీట్ కావాలని కోరుకుంటున్నారు.  
 
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒకే ఒక్క లుక్ రిలీజ్ చేశారు. అయితే అభిమానులకు అది సరిపోలేదు. ఎందుకంటే అందులో పవన్ కళ్యాణ్ లేడు. అందుకే ఎన్నో రోజులుగా సినిమాలో పవన్ లుక్ ఎలా ఉంటుందో రివీల్ చేయమని అడుగుతూ వచ్చారు. కానీ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళకపోవడంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోతోంది. దీంతో అభిమానులే పవన్ లుక్ ను రెడీ చేశారు.  
 
సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ సినిమా పోస్టర్ తీసుకుని ఎడిట్ చేసి అందులో పవన్ ను పెట్టి ఫస్ట్ లుక్ రూపొందించారు. ఆఫీషియల్ పోస్టర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది అది. ఠక్కున చూస్తే ఒరిజినల్ పోస్టరే అనేంత ఖచ్చితంగా ఉంది. పవన్ ఫ్యాన్స్ టాలెంట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  నిన్నటి నుండి ఆ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.