గోపిచంద్ కి గాయాలు,హాస్పటల్ లో చికిత్స

హీరో గోపీచంద్‌ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. తమిళ దర్శకుడు తిరు డైరక్షన్ లో గోపీచంద్‌ హీరోగా అనిల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ సమీపంలోని మాండవలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రోజు (సోమవారం) అక్కడ షూటింగ్ ముగియనుంది. దాంతో కొంచెం హడావిడిగా గోపీచంద్‌పై బైక్‌ ఛేజింగ్‌ ఫైట్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో అనుకోకుండా బైక్‌ స్కిడ్‌ అయింది.

దీంతో గాయపడ్డ అతడిని చిత్ర యూనిట్‌ సమీపంలోని ఫోర్టీస్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా గోపీచంద్‌ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదన‍్న వైద్యులు గాయాలకు చికిత్స తీసుకున్న తర్వాత షూటింగ్ లో పాల్గొనవచ్చిన తెలిపారు.

చిత్రం విశేషాల్లోకి వెళితే… ఇదో స్పై థ్రిల్లర్‌. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. సోమవారం ఇండియా–పాకిస్థాన్‌ సరిహద్దులో గుజరాత్‌లోని జైసల్మేర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ను స్టార్ట్‌ చేశారు. సినిమాను స్టార్ట్‌ చేయడమే ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో మొదలుపెట్టారు గోపీచంద్‌ అండ్‌ టీమ్‌.

దూకుడు, వన్ నేనొక్కిడినే వంటి చిత్రాలు తర్వాత అనీల్ సుంకర..భారీ బడ్జెట్ లు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తిరు చెప్పిన లైన్ నచ్చటంతో నమ్మి ఈ సినిమా చేస్తున్నారు. ఏ మాత్రం తేడా కొట్టినా 35 కోట్లు మటాష్ అని ఆయనకూ తెలుసు. అయితే కేజీఎఫ్ వంటి యాక్షన్ చిత్రం ఘన విజయం సాధించటం, అడవి శేషు గూఢచారి సినిమా హిట్ అవటం ఈ సినిమాపై నమ్మకాన్ని పెంచాయంటున్నారు. ఆ ధైర్యంతోనే ఈ సినిమా చేస్తున్నారంటున్నారు.

ప్రస్తుతం సెల్వన్‌ ఆధ్వర్యంలో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. యాభై రోజుల పాటు జరిగే తొలి షెడ్యూల్‌లో రాజస్థాన్‌, దిల్లీల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. విశాల్‌ శేఖర్‌ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి రచన: అబ్బూరి రవి, ఛాయాగ్రహణం: వెట్రి పళని స్వామి, కళ: రమణ వంక.