ఎన్టీఆర్ అభిమానుల‌కు శుభ‌వార్త‌

                                                             (ధ్యాన్) 

కంట‌ప‌డ్డావో క‌నిక‌రిస్తా.. ఎంట‌ప‌డ్డానో న‌రికేస్తావోబా అంటూ తొలి టీజ‌ర్‌లో కాస్త రాయ‌లసీమ యాస‌లో ఎన్టీర్ చెప్పిన డైలాగులు అభిమానులకు తెగ‌న‌చ్చాయి. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌క్కా యాక్ష‌న్ సినిమా రాబోతోంద‌ని అటు ఎన్టీఆర్‌, ఇటు త్రివిక్ర‌మ్ అభిమానులు పండ‌గ  చేసుకుంటున్నారు. ఆ ఆనందంతోనే `అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌` టీమ్ రెట్టింపు ఉత్సాహంతో ప‌నిచేస్తోంది. ఇప్పుడు అదే ఉత్సాహంలో రెండో టీజ‌ర్‌ను కూడా విడుద‌ల చేయ‌డానికిస‌న్నాహాలు మొద‌లుపెట్టింది. రెండో టీజ‌ర్లో సినిమాలోని కీల‌క న‌టీన‌టుల‌కు సంబంధించిన ప‌రిచ‌య‌వాక్యాల‌ను పొందుప‌ర‌చ‌డానికి కృషి చేస్తోంది. దీనికి ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ ఐడియా చెప్ప‌గా ఎన్టీఆర్ కూడా తల ఊపేశార‌ట‌. సో రెండో టీజ‌ర్ ముస్తాబులు జ‌రుగుతున్నాయి. తొలి స‌గంలో ఎన్టీఆర్ చేతిలో ఉన్న క‌త్తిని ఓ చోట క‌ల‌ర్‌, మ‌రో చోట బ్లాక్ అండ్ వైట్ వేసి ఏదో విష‌యం ఉంద‌ని చూచాయ‌గా చెప్పిన ద‌ర్శ‌కుడు, రెండో టీజ‌ర్‌లో ఏం ట్విస్ట్ ఇస్తాడో చూడాలి. ఏం హింట్ ఉంటుందో వెత‌కాలి. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న ఈ సినిమాను విడుద‌ల చేయాల‌న్న‌ది హారిక అండ్ హాసిని సంస్థ సంక‌ల్పం. వినాయ‌క‌చ‌వితికి రెండో టీజ‌ర్ విడుద‌ల‌వుతుంది.