ప్రచారానికి ఓ హద్దు ఉంటుంది. హద్దు మీరితే ఎలా ఉంటుందో కూడా తెలుసు. నెటి జనులే చీవాట్లు తినాలి. ఏం చేసినా అందులో ఓ అందం ఉండాలి. అందరూ మంచిగా చెప్పుకునే ఉండాలి. బూతును కూడా కవర్ చేయగలిగే నేర్పరి తనం ఉండాలి. కానీ ఓ ఇద్దరు మగాళ్లు చేసిన పని సభ్య సమాజం లో మగాళ్లు సిగ్గు పడేలా చేసారు. అవునే సోషల్ మీడియా సాక్షిగా జనాలు ఇలాగే రియాక్ట్ అవుతున్నారు. ప్రచారం పేరుతో ఇద్దరు మగాళ్లు పెదవులు జుర్రుకోవడం ఎప్పుడైనా ఎవరైనా చూసారా? ఇండియాలో ఇప్పటివరకూ ఇలాంటి దారుణానికి ఎవరు ఒడిగట్టలేదు. కానీ అలాంటి ప్రయత్నం ఇద్దరు తెలుగు వాళ్లు చేయడం శోచనీయం.
తమ సినిమా నలుగురికి తెలియాలని భావించి ఆ ఇద్దరు ఒకరి పెదాలు ఒకరు జుర్రుకున్నారు. సినిమాల్లో హీరో-హీరోయిన్లు మాదిరి లిప్ కిస్సులో రెచ్చిపోయారనుకోండి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే? యంగ హీరో సిద్దు జొన్నలగడ్డ- డైరెక్టర్ రవికాంత్. వీరిద్దరే ఈ ఘోరానికి తెగబడ్డారు. ఇద్దరు కలిసి కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమా చేస్తున్నారు. ఇటీవలే సినిమా నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయింది. దీంతో ప్రచారం కోసం ఇద్దరు లిప్ లాక్ వేసారు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో ప్రచారానికి వదిలారు. దీంతో నెటి జనుల కామెంట్లకు అద్దు అదుపు లేదు.
ఇద్దరు తేడాగాళ్లు లా ఉంది…అందుకే ఇలా తెగబడ్డారంటూ కామెంట్ల తో దాడి చేస్తున్నారు. అయితే ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతుంది. చివాట్లు తిన్నా వాళ్లు అనుకున్నది మాత్రం సాధించగలిగారు. ఆ లిప్ లాక్ కారణంగా సినిమా గురించి అందరికీ తెలుస్తోంది. అన్నట్లు ఈ చిత్రాన్ని పెద్ద తలకాయలే రిలీజ్ చేసాయి. రానా దగ్గుబాటి సమర్పణలో వయోకామ్ 18 మోషన్ పిక్చర్స్ నిర్మించాయి. ఇందులో హీరోకు జోడీగా శ్రద్ధా శ్రీనాధ్ నటించింది. కానీ అమ్మడు మాత్రం ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదు. బ్రతికిపోయింది.