సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని నటిస్తోన్న`కృష్ణ అండ్ హిజ్ లీల` నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా రిలీజ్ కు ముందు ట్రైలర్ తోనే సంచలనం సృష్టించింది. అడల్ట్ కంటెంట్ జోనర్ గా యువతలో బాగా పాపులర్ అయింది. బూతు సినిమాగా ప్రచారం దక్కించుకుంది. ఇందులో పాత్రల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు పీక్స్ లో ఉన్నాయని రిలీజ్ తర్వాత తేలింది. ముగ్గురు అమ్మాయిలతో ఓ యువకుడు నడిపే ప్రేమ నేపథ్యంలో సాగే చిత్రమిది. తాజాగా సినిమాపై రాకేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసాడు. ఇందులో నటించిన హీరోయిన్ల శృంగార పాత్రలన్నింటికీ దేవతల పేర్లు పెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దేవతల పేర్లతో ఆన్ స్ర్కీన్ పై హీరోయిన్లు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం హిందు సంప్రదాయానికి విరుద్దమని..దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాడు. మతపరమైన నేపథ్యం వెనుక ఉద్దేశపూర్వకమైన బలవంతం ఉందంటూ ఆరోపించాడు. దీంతో సినిమాపై వివాదం నెలకొంది. ప్రస్తుతం సినిమా నెట్ ప్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఫిర్యాదు నేపథ్యంలో సైబర్ క్రైమ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాలి. సినిమాలపై ఇలాంటి వివాదాలు కొత్తేం కాదు. గతంలోనూ పలు సినిమాలు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొని రిలీజ్ కు మార్గం సుగమం చేసుకున్న సందర్భాలున్నాయి. కాగా ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది. రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐదవ దశ లాక్ డౌన్ దేశంలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. జూన్ 30 వరకూ కేంద్ర ప్రకటించిన లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఆ తర్వాత కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపై రాష్ర్టాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ర్టాలు కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో రీఓపెన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ చేస్తారు? అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే కరోనా కేసుల సంఖ్య మాత్రం దేశంలో అంతకంకు పెరుగూతూనే ఉంది.