నారీ లోకం….ఫ్యాషన్ అందాల తో  మురిసింది  

యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర  రమంతే దేవతా అన్నారు.ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తారట.అవును ఇది నిజం..స్త్రీలు వంటింటి కుందేళ్ళని.. అబలలని..కొన్నాళ్ళు అనుకునే వారు.కానీ నిజానికి స్త్రీలు శక్తి స్వరూపిణులు ..అట్లకాడ పట్టుకున్న ఇదే స్త్రీలు అంతరిక్షంలోకి వెళ్లారు.ఆటపాటల్లో యుద్ధవిద్యల్లో ఇలా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. ఇలాంటి మహోన్నతమైన నారీమణుల కోసం  అచ్చంగా స్వచ్ఛంగాఅంకితం చేసిన మెగా కిట్టీ పార్టీయే “నారీ లోకం “

కుటుంబ వ్యవహారాల్లో..ఉద్యోగాల్లో అలసిన నారీలోకానికి అమృతపు జల్లులా..ఆటపాటల వినోదాలు వీచిక “నారీలోకం”  బుల్లితెర క్వీన్ ఉదయభాను యాంకర్ గా టీవీ సినిమా ఆర్టిస్టులతో ఆటపాటలు..డాన్సులు..కేరింతలు మస్త్ మజా తో కొనసాగింది.. ఎంటర్ టైన్మెంట్ కె సరికొత్త భాష్యం చెప్పిన “నారీ లోకం”యూసఫ్ గూడా సవేర ఫంక్షన్ హాల్ లో సర్వాంగ సుందరంగా మొదలై అంగరంగ వైభవంగా ముగిసింది.వేసవి కాలంలో మంచు కురిసినట్టు..మగువలంతా మురిసిపోయారు.

సినిమా టీవీ నటులయిన..రోహిణి..రాగిణి..ఇంటూరి వాసు..రిషిక..రాంజగన్..భాను..వీళ్లందరితో నారీ మణులు ఆడి పాడి మురిసిపోయారు..మునుపెన్నడూ చూడని ఎంటర్ టైన్ మెంట్ జల్లుల్లో తడిసిపోయారు..బోల్డన్ని బహుమతులతో క్యాష్ ప్రైజ్ లతో అందరిలో ఆనందం వెల్లి విరిసింది..జెమినీ టీవీ మరియు రెడ్ నోస్ ఎంటర్ టైన్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్ సక్సెస్ తరువాత ఇదే స్ఫూర్తి తో ఇదే విధంగా..మరిన్ని చోట్ల నిర్వహిస్తామని జెమినీ బిజినెస్ హెడ్ సుబ్రహ్మణ్యం.. రెడ్ నోస్ ఎంటర్ టైన్ మెంట్ నిర్వాహకులు రాజేష్ తెలిపారు.