సీనియర్ నటి రాశి బ్యూటీ సీక్రెట్ ఏంటో మీకు తెలుసా?

రాశి తెలుగు చలనచిత్ర నటి. ఈమె తెలుగు, తమిళ భాషల్లో నటించింది. ఈమె దర్శకుడు శ్రీముని నీ వివాహం చేసుకుంది. 1986లో మమతల కోవెల చిత్రం ద్వారా బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బాలనాటిగా కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత హీరోయిన్ గా వరుస అవకాశాలతో సినీ ఇండస్ట్రీలో రాణించింది.

కెరీర్ ప్రారంభంలో శుభాకాంక్షలు, గోకులంలో సీత సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు ఇండస్ట్రీలోనే అగ్ర హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ఇక తనదైన శరీరంలో ముందుకు దూసుకుపోతున్న తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో నటించింది. నిజం సినిమాలో నెగటివ్ రోల్ లో నటించి మంచి గుర్తింపు పొందింది.

వివాహం చేసుకున్న తర్వాత కాస్త సినిమాలకు దూరమైంది. రాశి గతంలో ఒక వీడియో ద్వారా తాను బ్యూటీ సీక్రెట్ కోసం చేసే టిప్స్ ఏంటో సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియో ద్వారా తాను ప్రతిరోజు ఉదయం లేవగానే వామ్ అప్ చేస్తానని వెయిట్ లాస్ కోసం సోయాబీన్ బాగా ఉపయోగపడుతుందని తెలిపింది.

సోయాబీన్ ను రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే ఒక కుక్కర్లో వేసి, కాస్త నీరు పోసి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఒక బాణీ లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి, అందులో పప్పు దినుసులు, కరివేపాకు, రెండు ఎండుమిరపకాయలు వేసి ఎర్రగా వచ్చేవరకు వేయించుకోవాలి.

తర్వాత దీనిని ఒక బౌల్ లో తీసుకొని సోయాబీన్ వేసి కలుపుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు, కొంచెం తరిగిన ఉల్లిపాయలను వేయాలి. డైట్ ను ఫాలో అవుతూ వారానికి రెండు లేదా మూడుసార్లు ప్లాన్ చేసుకొని దీన్ని ఆహారంగా తీసుకుంటే కచ్చితంగా శరీరం బరువు తగ్గడానికి ఇదొక ఔషధంలా పనిచేస్తుంది అని తెలపడం జరిగింది.

ఇక రాశి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి జెమినీ టీవీలో గిరిజా కళ్యాణం సీరియల్ ద్వారా బుల్లితెరలో అడుగుపెట్టింది. ప్రస్తుతం మాటీవీలో జానకి కలగనలేదు సీరియల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.