జెమినీలో రామాయణం సీరియల్‌.. 27 నుంచే ప్రారంభిస్తున్నట్లు వెల్లడి!

పురాణాలలో ‘రామాయణం’కి వున్నా వైశిష్ట్యం చాలాగొప్పది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు మానవుడిగా జన్మించి ఎలా మసలుకోవాలి, ఎటువంటి ధర్మాలు పాటించాలి, ఎంతటి కష్టమొచ్చినా ధర్మాన్ని విడవకుండా ఎలా జీవనం సాగించాలి అని రాముని పాత్రలో చాటి చెప్పాడు. వాల్మీకి రచించిన ఈ రామాయణం ఎన్నిసార్లు విన్నా, చూసినా తనివి తీరదు అని చెపుతూ వుంటారు. రామరాజ్యం అన్న మాట రాముడు పరిపాలించిన తీరును బట్టి వచ్చింది.

తండ్రి మాటకి కట్టుబడి, తండ్రిని ధర్మపథంలో నిలబెట్టడానికి అడవికి వెళ్లిన రాముడు, తండ్రి మాటని జవదాటని కొడుకుగా, ఏకపత్నీవ్రతుడిగా, ప్రజల క్షేమం కోసం ధర్మం తప్పని రాజుగా, అందరికి ఆదర్శంగా నిలిచిన శ్రీరామగాథను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.అ టువంటి రాముని చరిత్ర ‘రామాయణం’ మరోసారి తెలుగులో టీవిలో ప్రసారం కానుంది.

ఇంతకీ ఈ రామాయణం సీరియల్‌ ఎక్కడ ప్రసారం అవుతోంది, ఎప్పటి నుండి కానుంది అంటే, ఈ నెల 27వ తేదీ నుండే. జెమిని టివిలో మే 27వ తేదీ సోమవారం సాయంత్రం గం. 6.30 లకు ఈ దృశ్యకావ్యం ‘శ్రీమద్‌ రామాయణం’ సీరియల్‌ ప్రసారం కానుంది అని నిర్వాహకులు చెపుతున్నారు. ‘శ్రీ మధ్‌ రామాయణం’.

ఈ సీరియల్‌ లో శ్రీరాముని అవతార విశిష్టత, జన్మ వృత్తాంతం, లంకాధిపతి అయిన రావణాసురుడి జన్మ వృత్తాంతం మొదలుకుని రామాయణంలోని అన్ని ఘట్టాలను కనులకు కట్టినట్లుగా అద్భుతమైన సాంకేతిక విలువలతో అత్యద్భుతంగా చిత్రీకరించి శ్రీ రామ గాథను జెమిని టివి అభిమాన ప్రేక్షకులందరికి ఎప్పటికి గుర్తుంది పోయేలా అందించడం జరుగుతోంది అని చెపుతున్నారు.

శ్రీ వాల్మీకి విరచిత రామాయణం ’శ్రీమద్‌ రామాయణం’ గా సూపర్‌ గ్రాఫిక్‌ టెక్నాలజీతో, అనుభవజ్ఞులైన నటీనటుల నటనతో, మనుసుని ఆకట్టుకునే మాటలతో, ప్రతి తెలుగు ప్రేక్షకుడిని అలరించడానికి మే 27వ తేదినుండి సోమవారం నుండి శనివారం వరకు, ప్రతి రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలనుండి 7 గంట 30 నిమిషాల వరకు ప్రసారం కానుంది.