కౌశల్ హీరో, ‘బిగ్ బాస్ 2’ బ్యాచ్ అంతా సినిమాలో

ఆ మధ్యన దర్శకుడు మారుతి   కౌశల్‌కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో  కొన్ని కామెంట్స్ చేశారు.’బిగ్ బాస్ 2 తెలుగు ఎపిసోడ్ చూశాను. కౌశల్ ప్రెజెన్స్ చాలా ఆకట్టుకుంటోంది. కౌశల్ ఆర్మీ పేరుతో ఆయన చాలా ఫాలోయింగ్ ని సంపాదించుకోవడం చూస్తుంటే బాగా అనిపిస్తోంది. ఈ సీజన్ విన్నర్ అతడే అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్’ అన్నారు. ఆయన అన్నట్లుగానే విన్నర్ గా కౌశల్ నిలిచారు. కౌశ‌ల్‌కు రోజు రోజుకి మ‌ద్ద‌తు భారీగా పెరిగింది. సోష‌ల్ మీడియాలో  ఫాలోయింగ్  గురించి చెప్పక్కర్లేదు.

ఈ నేపధ్యంలో కౌశల్ …బిగ్ బాస్ నుంచి బయిటకు వచ్చాక మారుతి దర్శకత్వంలో సినిమా సైన్ చేసారు. ఎవరూ ఊహించని పరిణామం ఇది. మారుతి ఈ చిత్రంలో బిగ్ బాస్ 2 లో కనిపించిన మరికొంతమందిని ఈ సినిమాలో చూపించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో గీతా గోవిందంలో హీరోయిన్ గా చేసిన రష్మిక చేస్తోంది. అలాగే ..గీతా మాధురిని ఐటం సాంగ్ కు అడిగినట్లు సమాచారం. తనీష్, అమిత్ తివారిలు ఈ సినిమాలో విలన్స్ గా చేయనున్నారు. మొత్తానికి బిగ్ బాస్ 2 లాంటి మరో గేమ్ షో వెండితెరపై కనిపించనుందన్నమాట. సూపర్ కదా మారుతి ఐడియా.