గీత గోవిందం సినిమా 59 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది . పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా బన్నీ వాసు నిర్మించాడు . ఈ సినిమా గీత ఆర్ట్స్ 2 సంస్థ అల్లు అరవింద్ ఆశీస్సులతో తయారైంది . కేవలం ఐదు కోట్ల ఖర్చు తో పరశురామ్ గీత గోవిందం చిత్రాన్ని రూపొందించాడు . ఆగష్టు 15న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది . అందరిని దిగ్బ్రాంతి కి గురి చేసింది .
చాలా సినిమాలు విడుదలైన వారం రోజులకే వెళ్లిపోతున్నాయి. అలాంటిది ఈ సినిమా 50 రోజులు ఆడటం అనేది సంచలన విజయంగా చెప్పుకోవచ్చు . నిజానికి ఈ సినిమా కథ విని ఒకరిద్దరు హీరోలు పెదవి విరిచారట . అయినా దర్శకుడు పరశురామ్ , బన్నీ వాసు కథ మీద నమ్మకంతో విజయ దేవర కొండకు చెప్పడం అతను ఒప్పుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారట.
ఛలో చిత్రంలో నటించిన కన్నడ భామ రష్మిక మందన్న గీత పాత్రకు సరిగా సరిపోతుందని భావించడంతో ఆమెను సంప్రదించడంతో ఆమె కూడా సంతోషంగా ఒప్పుకోవడంతో సినిమాను మొదలు పెట్టారు . ఈ సినిమాను నడిపించింది మాత్రం అరవిందే . 50 రోజులకు గీత గోవిందం సీనియా 125 కోట్ల రూపాయలను వసూలు చేసిందట .
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయిపోయాడు . రష్మికకు స్టార్ డమ్ వచ్చింది . తెలుగు, కన్నడంలో రష్మిక ఇమేజ్ పెరిగింది .చిన్న సినిమాయే కదా అని చిన్న చూపు చూస్తే … ? బాక్సులు బద్దలు కొడుతోంది జాగ్రత్త అని గీత గోవిందం నిరూపించింది .