`గ్యాంగ్‌లీడర్` స్టోరీ ఇదేనా?
కొన్ని వరుస పరాజయాల తరువాత నాని తన పంథా మార్చుకున్నాడు. కొత్తగా ప్రయత్నించాలని చేసిన ప్రయత్నంలో జెర్సీ
కి క్రిటిక్స్ ప్రశంసలు దక్కినా ఆ స్థాయి కలెక్షన్స్ రాకపోవడం నిరాశపరిచింది. అయితే మరోసారి నాని కొత్తగానే ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్‌లీడర్
ఈ తరహానే. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నడుస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రియాంక మోహన్ కథానాయికగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఐదుగురు యువతుల గ్యాంగ్‌కు నాని లీడర్ గా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఓ బ్యాంక్‌లో ఐదుగురు వ్యక్తులు రాబరీతో సినిమా మొదలవుతుంది. రాబరీ తర్వాత వీరంతా హత్యకు గురి కావడం వారి బంధువులైన ఐదుగురు యువతులు దాని వెనకున్న రహస్యం ఏంటనేది అన్వేషణ మొదలుపెట్టడంతో కథ ట్రాక్ ఎక్కుతుంది.
కథ లేదు.. కథనమే కాపాడాలా?
ఈ క్రమంలో హాలీవుడ్ కథల్ని కాపీ కొట్టి రివేంజ్ కథలు రాసే పెన్సిల్(నాని) ఈ ఐదుగురు మహిళలు సహాయం కోరతారు. ఆ తరువాత కార్తికేయ ఎంటరవుతాడు. హత్యలు చేసింది కార్తికేయనే అని తెలిసే లోపే కాదు మరో సీక్రెట్ మ్యాన్ విషయం బయటపడుతుంది. ఆ వ్యక్తి నాని అని తేలడం, అతను మరో నాని(డ్యుయెల్ రోల్) అని తేలడంతో ఒక్కసారిగా ఐదుగురు మహిళలు షాక్‌కు గురవుతారు. ఆ తరువాత కథ ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగుతుందట.
నానికి అవార్డు ఖాయం కానీ రివార్డ్ కష్టమే!
చెప్పుకోవడానికి పెద్దగా కథ లేకపోవడం దీనికి ప్రధాన మైనస్‌గా చెబుతున్నారు. స్క్రీన్‌ప్లే జిమ్మిక్కులతో, ట్విస్ట్‌లతో విక్రమ్ కథని నడిపించాడని, కామెడీ వర్కవుట్ అయితే కొంత బయటపడే అవకాశం వుందని ల్యాబ్ రిపోర్ట్. పెర్ఫార్మెన్స్ పరంగా నానికి అవార్డు వస్తుందేమో కానీ రివార్డులు మాత్రం కష్టమే అనే మాట ప్రధానంగా వినిపిస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అన్నది మౌత్ టాక్ ని బట్టి కూడా మారొచ్చేమో. మనం
తరహాలో ఇంకేదైనా మ్యాజిక్ వర్కవుటైతే.. ఫన్ వర్కవుటైతే .. మాస్ కి కూడా ఎక్కే ఎలిమెంట్స్ ఏవైనా కనిపిస్తే అప్పుడు ఈ సినిమా ఫలితం చిత్రయూనిట్ ఆశించినంత గొప్పగా ఉంటుందేమో! ఈనెల 13న అన్నిటికీ సమాధానం.. గెట్ రెడీ.