గల్లా అశోక్ ప్రక్కన హీరోయిన్ గా నభా నటేష్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు , మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ త్వరలో హీరోగా పరిచయం అవుతున్నాడు .  గల్లా జయదేవ్ , పద్మావతి కుమారుడు అశోక్ . అశోక్ చిత్రాన్ని దిల్ రాజు కృష్ణ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా త్వరలో సెట్స్  మీదకు వెళ్లబోతుంది .

అయితే ఈ చిత్రంలో అశోక్  ప్రక్కన హీరోయిన్ గా నభా నటేశను ఎంపిక చేసినట్టు తెలిసింది . కన్నడ భామ నభా నటేష్ ఇటీవల సుధీర్  హీరోగా నటించిన “నన్ను దోసుకుందువటే ” చిత్రంలో నటించింది . ఆ సినిమాల నభా  నటన చాలా మందికి  నచ్చింది . ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో నటించింది .

అశోక్ పక్కన నాభా అయితే బాగుంటుందని దిల్ రాజు భావించినట్టు తెలిసింది  నాభా నటేష్ ను సుధీర్ బాబే  సూచించాడని తెలిసింది .