బాహుబలి2 రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ‘ఆర్ఎక్స్ 100’

బాహుబలి2 బాక్సాఫీస్ సూత్రాలను కొత్త నిర్వచనమిచ్చిన ట్రెండ్ సెట్టింగ్ మూవీ. అలాంటి ఈ సినిమాకి సంబంధించిన ఓ రికార్డుని…ఓ చిన్న చిత్రం బీట్ చేయడమంటే చిన్న విషయం కాదు.అయితే ఆ అసాధ్యాన్ని  సుసాధ్యం  చేసింది ఓ చిన్న సినిమా.ఆ చిత్రం మరేదో కాదు..ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సెన్సేషన్  హిట్ గా దూసుకుపోతున్న ఆర్ఎక్స్ 100 . ఆ వివరాల్లోకి వెళితే ..హైదరాబాద్ లోని ఆర్ టి సి  క్రాస్ రోడ్ దేవి 70 ఎం.ఎం. థియేటర్ లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టిచిందని సమాచారం.తొలి వారంలో  టాప్3 గ్రాసర్స్ లో మొదటి స్థానంలో ఆర్ ఎక్స్100 రూ.29,32,867/- గ్రాస్ తో టాప్ లో ఉండగా..రెండో స్థానం లో రూ.28,82,370/- తో బాహుబలి2 నిలిచింది.ఇక మూడో స్థానం లో రూ.28,67,367/- తొలిప్రేమ నిలిచింది.ఆర్ ఎక్స్100 అభిమానులకు ఇది శుభవార్త మరి .