వర్మ ‘కోబ్రా’ ఫస్ట్ లుక్ వదిలి, కేసీఆర్ ని కదిపాడు

వర్మ మరో సంచలనానికి రెడీ అయ్యారు. తనే నటుడుగా మారి ‘కోబ్రా’అనే టైటిల్ తో ఓ చిత్రం ప్రకటించేసారు. ఆర్జీవీ గన్‌ షాట్‌ ఫిల్మ్స్‌ సంస్థ ‘కోబ్రా’ అనే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘శత్రువుని చంపడానికి త్రాచు పాముని చేరదీస్తే, ఎప్పుడో ఒకప్పుడు మనల్ని కూడా కాటేస్తుంది’ అనే అంశం చుట్టూ నడిచే కథ ఇది. ఈ చిత్రంలో వర్మ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్మ, అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకులు.

సినిమాలో ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినిల్ పట్టుకోవటానికి ఓ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ చేసే ప్రయత్నాలు…చివరకి ఎలా ఆ క్రిమినిల్ కథ ముగిసిందనేది చూపబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా విషయంలో వివాదానికి ఎంచుకున్న అంశం సి ఎం కేసీఆర్ అని అర్దమవుతోంది. అయితే సీఎం ని మంచిగానే చూపెడతారు అని చెప్పుకుంటున్నారు. ఆయన ఆర్డర్స్ పైనే ఈ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పని చేస్తారంటున్నారు.

ఇక తెలంగాణాలో మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ ఎవరనే విషయమై చాలా మంది అందరికీ గుర్తు వస్తున్నారు. అయితే పాములు అనగానే ఒకే ఒక వ్యక్తి గుర్తు వస్తారు. అతనెవరో మీకు ఇప్పటికే అర్దమైపోయి ఉంటుంది. అలాగే అతన్ని తుద ముట్టించిన ఆఫీసర్ ..ఆ రోజు ఏం జరిగిందనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్కే.