ఫస్ట్ లుక్ : ‘సూర్యకాంతం’గా కొణిదెల నీహారిక

‘ఒక్క మనసు’తో హీరోయిన్ గా ఆకట్టుకోలేక పోయిన కొణెదల నీహారిక ఈ ఏడాది వరుస చిత్రాలు చేస్తోంది. ఈమె నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ కూడా వర్కవుట్ కాలేదు. దాంతో ఓ పక్క సినిమాల కోసం వైవిధ్యమయిన కథల్ని ఎంపిక చేసుకుంటూనే మరో పక్క వెబ్‌సిరీస్ లోనూ తన హవా కొనసాగిస్తోంది.

ఇదిలా ఉంటే నీహారిక తెలుగులో ‘సూర్యకాంతం’ పేరుతో మరో సినిమా చేస్తోంది. ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన ప్రణీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈచిత్రంలో యువ హీరో రాహుల్ విజయ్ నిహారిక కు జోడీగా నటిస్తున్నాడు.

ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదలచేశారు. లీడ్ పెయిర్ తో రూపొందిన ఈ పోస్టర్ ఆకట్టుకుంది. నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం విడుదలకానుంది. మరో ప్రక్క ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’ అనే తమిళ సినిమాతో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. మరి ‘సూర్యకాంతం’గా నీహారిక ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.