హీరోల తీరు..! నేడు ఏడాదికో సినిమా.. నాడు ఒకేరోజు రెండు సినిమాలు విడుదల.

ఇప్పటికీ భారతదేశ సినీ పరిశ్రమలో ఏడాదిలో ఎక్కువగా సినిమాలు విడుదలయ్యేది తెలుగు చిత్ర పరిశ్రమలోనే. డబ్బింగ్ సినిమాలు కాకుండానే 100కు పైగానే సినిమాలు విడుదలవుతూంటాయి. వీటిలో స్టార్ హీరోల సినిమాల సంఖ్య తక్కువే. కానీ.. నేటి పరిస్థితుల్లో ఒక హీరో సినిమా పూర్తయ్యాక మరో సినిమా ఎప్పటికి వస్తుందో వారే చెప్పలేని పరిస్థితి. దాదాపుగా ఏడాదికి ఒక సినిమానే. అయితే.. ఎన్టీఆర్, చిరంజీవి శకంలో మాత్రం స్టార్ హీరోల సినిమాలు.. ఒక సినిమా ధియేటర్లో ఉండగానే మరో సినిమా విడుదలయ్యేది.

ఏ సినిమా కూడా మరో సినిమా సక్సెస్ రేట్ ను తగ్గించేది కాదు. అలా వచ్చేవి సినిమాలు. ఒక దశలో ఏలూరులో 21 సినిమా ధియేటర్లు ఉంటే.. అన్నింట్లో ఒకేసారి కృష్ణ నటించిన సినిమాలు రన్ అయ్యాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరెవరికీ ఈ రికార్డు లేదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో హీరోల సినిమాలు ఒక్కోసారి.. ఒకేరోజు రెండు సినిమాలు విడుదలయ్యేవి. అనుకోని పరిస్థితుల్లో చాలా.. అరుదుగా ఈ జనరేషన్ లోనూ కంటిన్యూ అయింది. ఎన్టీఆర్ టు నాని.. ఇలా ఒకేరోజు రెండు సినిమాలు విడుదల చేసారు.

ఎన్టీఆర్: 1961, మే 5.. సతీ సులోచన, పెండ్లి పిలుపు

శోభన్ బాబు: 1968, జులై 19, 1968.. లక్ష్మీ నివాసం, పంతాలు పట్టింపులు

కృష్ణంరాజు: 1984, జనవరి 14.. ఇద్దరు దొంగలు, యుద్ధం

చిరంజీవి: 1980, సెప్టెంబర్ 19..  కాళీ, తాతయ్య ప్రేమలీలలు

చిరంజీవి: 1982, అక్టోబర్ 1.. టింగు రంగడు, పట్నం వచ్చిన పతివ్రతలు

బాలకృష్ణ: 1993, సెప్టెంబర్ 3..  బంగారు బుల్లోడు, నిప్పు రవ్వ

నాని: 2015, మార్చ్ 21..  జెండా పై కపిరాజు, ఎవడే సుబ్రమణ్యం

మెహ్రీన్ కౌర్: 2020, జనవరి 15.. తెలుగులో ఎంత మంచివాడవురా, తమిళంలో పటాస్

నిధి అగర్వాల్: 2021, జనవరి 14.. తమిళంలో భూమి, ఈశ్వరన్

.. ఇలా ఒకేరోజు విడుదలైన హీరోల సినిమాల్లో దాదాపుగా ఒక సినిమా హిట్టైతే.. మరో సినిమా ఫ్లాప్ గా నిలిచాయి. గతంలో సినిమాలు ఎక్కువ చేసి రిలీజ్ డేట్లు క్లాష్ అయ్యేవి. ఇప్పటితరంలో అనుకోని పరిస్థితుల్లోనే ఇలా జరుగుతున్నాయని చెప్పాలి.