నటులకు గ్లామర్ వస్తే ఏరకంగా ప్రవర్తిస్తారో అనేక మంది అనేక సందర్భాల్లో తమ విశ్వరూపం చూపించారు . సినిమా గ్లామర్ కోసం నటీనటులు ఎందుకు తాపత్రయ పడతారో అనేక ఘటనలు మనకళ్ళ ముందు మెదులుతాయి . గ్లామర్ ను అడ్డం పెట్టుకొని హీరో ,హీరోయిన్లు ఎలా డబ్బు సంపాదిస్తారో మనకు తెలుసు. షాప్ ఓపెనింగ్, లేదా కార్యక్రమానికి చీఫ్ గెస్ట్, పెళ్ళికి హాజరు కావాలన్న కరెన్సీ పడితే కానీ కాలు పెట్టమనే నటులు , నటీమణులు వున్నారు . తమ కార్యక్రమంలో గ్లామర్ ఉంటే కానీ మజా రాదు అనుకునే వ్యాపారవేత్తలు కూడా వున్నారు .అందుకే నటీనటులు ఇటు దేశంలోనూ అటు విదేశాల్లో తమ ముఖాన్ని కరెన్సీ గా మార్చుకుంటున్నారు .
ఇప్పుడు మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది . చెన్నై లోని ఓ సాంస్కృతిక సంస్థ కళాసుధ తన కార్యక్రమంలో బ్రహ్మానందంకు సన్మానం చెయ్యాలని తీర్మానించు కున్నారు . బ్రహ్మ్మనందం అంటే వారికి ఎంతో అభిమానం . ఈ తరంలో నవ్వులను పండించడంలో బ్రహ్మానందం తరువాతనే ఎవరైనా . అందుకే వారు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి బ్రహ్మానందం ను కలిసి తమ సన్మానం అందుకోవాలని విన్నవించుకున్నారు .”అబ్బో ఇలాంటివి ఎన్నో చూసాను.. నేను పద్మశ్రీ బ్రహ్మానందంను “అని వారికి చెప్పాడు . అంతకీ ఆయన వస్తాడో రాడో చెప్పలేదు . పైగా ఇప్పుడు సినిమాలు కూడా బాగా తగ్గిపోయాయి . వీరి వీక్నెస్ గమనించిన బ్రహ్మ్మనందం “మరి చెన్నై వచ్చి సన్మానం స్వీకరించినందుకు ఏమిస్తారు అని డైరెక్ట్ గా అడిగేశారట . ఇది ఎక్సపెక్ట్ చెయ్యని వారు కాసేపు మౌనం వహించి “మీరే చెప్పండి సార్ ” అన్నారట .వారి వైపు చూసి ” ఓ లక్షన్నర పెట్టి బంగారు కంకణం తొడగండి , మీకు గౌరవంగా ఉంటుంది ” అన్నాడట . అందుకు వారు సరేనని చెప్పారట . ఈ విషయం ఇప్పుడు ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారు . సన్మానం చేసి ఎదురు డబ్బు ఇవ్వడం అంటే ఇదేనేమో ? ఎంతైనా బ్రహ్మానందం ను చేసి నేర్చుకోవాలి కదూ ?