నిబందనలు పెట్టుకొనేదే వాటిని తప్పకుండా పాటించడానికి , అతిక్రమించడానికి కాదు. అయితే అయిన వారికి ఒకరకంగా, కానీ వారికి మరో రకంగా కూడా రూల్స్ ను మార్చుకోవచ్చని తెలుగు ఫిలిం ఛాంబర్ నిరూపించింది. తెలుగు సినిమా రంగంలో 24 విభాగాల్లో సుప్రీం బాడీ ఛాంబర్. వాద వివాదాలను ఈ సంస్థే పరిష్కరిస్తుంది.
ఇక ప్రభుత్వానికి సినిమా రంగానికి వారధిగా కూడా ఈ చాంబర్ వ్యవహరిస్తోంది. సినిమా రంగంలో ఎంతటివారైనా సరే ఛాంబర్ రూల్స్ పాటించాల్చిందే. హైదరాబాద్ ఫిలిం నగర్లో తెలుగు సిల్మ్ ఛాంబర్ కార్యాలయం వుంది. సినిమా రంగానికి ఇది కూడలి. ఈ ఛాంబర్ రామానాయుడు భవనంలో మొదటి అంతంస్తులో వుంది.
అదే అంతస్తులో సినిమా రంగ అవసరానికి ఒక చిన్న ప్రివ్యూ థియేటర్ వుంది. ఈ థియేటర్ లో రేట్లు కూడా మిగతా థియేటర్ లతో పోల్చితే తక్కువే. ఈ థియేటర్ ను ఎట్టి పరిస్థితిలోనూ షూటింగ్ లకు ఇవ్వకూడదని వారి రూల్స్ లో పెట్టుకున్నారు. ఇప్పటివరకు రామానాయుడు భవనం క్రింద మాత్రం షూటింగ్ లకు అనుమతి ఇచ్చారు.
అది ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉంటుంది. పైన ప్రివ్యూ థియేటర్ లో మాత్రం షూటింగ్ లకు అనుమతించలేదు. అయితే ఆదివారం నాడు ప్రివ్యూ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న “ఎన్టీఆర్ బయోపిక్ ” చిత్రం షూటింగ్ జరిగింది. బాలకృష్ణ స్వయంగా ఫిలిం ఛాంబర్
అధ్యక్షుడు కు లెటర్ రాశాడట.
అందుకే తప్పని సరి పరిస్థితుల్లో తమ రూల్స్ ను పక్కన పెట్టి షూటింగ్ కు అనుమతి ఇచ్చారని తెలిసింది. బాలయ్య మాట కాదంటే ఇంకేమైనా ఉందా?