రేయ్…నీ పిచ్చ తగలెయ్య…ఏం చేస్తున్నావో తెలుస్తోందా

సోషల్ మీడియాలో ఈ క్రింద వీడియో చూసినవారంతా అదే మాట అంటున్నారు. తను అభిమానించే హీరో కోసం ప్రాణాలకు తెగించటం రుచించని వ్యవహారమే. ఏదైనా జరిగి ప్రాణం పోతే ఆ హీరో తీసుకొస్తాడా అంటున్నారు. అసలు ఏం జరిగింది..ఏంటి ప్రస్టేషన్ అంటారా…తమిళ స్టార్ హీరో శింబు ఫ్యాన్స్ కాస్తంత ఎక్కువే. వాళ్లు కూడా బాగా మాస్ పీపుల్. అతని కోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇచ్చేసే బ్యాచ్.

అయితే శింబు గత  కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక డీలా ప‌డ్డాడు. తాజాగా మ‌ణిరత్నం తెర‌కెక్కించిన చెక్క చివంత వానం (తెలుగులో న‌వాబ్) చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇందులో ఎతిరాజ్ అనే పాత్ర పోషించిన శింబు సెర్బియాలో ఆయుధాల‌కి డీల‌ర్‌గా ప‌నిచేసే పాత్ర చేశాడు. ఈ పాత్ర‌లో శింబు త‌న అద్బుతమైన ప‌ర్‌ఫార్మెన్స్ చూపించి ఇటు విమ‌ర్శ‌కులు, అటు అభిమానులని మెప్పించారు. దాంతో అందరూ శింబు గురించి మాట్లాడుకుంటున్నారు.

ఊహించనివిధంగా త‌మ హీరోకి ఇంత మంచి పేరు రావ‌డంతో ఓ అభిమాని ఆ ఆనందం తట్టుకోలేక..ఇదిగో ఇలా  శ‌రీరానికి సీకులు గుచ్చుకొని క్రేన్‌కి వేలాడుతూ ఫీట్స్ చేయటం మొదలెట్టాడు.  దాదాపు 25 అడుగుల ఎత్తున్న శింబు కటౌట్‌కి పాలాభిషేకం చేసి షాక్ ఇచ్చాడు.

మీడియా మొత్తం ఈ వీడియోని ప్రసారం చేసింది. అయితే ఈ  అభిమాని అత్యుత్స‌హాన్ని మాత్రం చాలా మంది తిట్టిపోస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రు అత‌ని చ‌ర్య‌ని త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం శింబు అభిమాని చేసిన ఈ వెర్రి మొర్రి  చేష్ట సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. శింబు అయినా తన ఫ్యాన్స్ ని ఇలాంటి చేష్టలు చెయ్యొద్దని చెప్పాలని అంటున్నారు.