వెళ్ళిపోమాకే, ఈ నగరానికేమైంది లాంటి చిత్రాల్లో నటించిన విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ఫలక్‌నుమా దాస్. కరాటేరాజు నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం పూర్తిగా హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ లో సాగుతుంది. సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి లు ఫిమెల్ లీడ్ కేరక్టర్స్ లో కనిపించే ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఫలక్ నుమా అనే ఏరియాలో శంకరన్న అనే వ్యక్తిని చూసి.. చిన్నప్పడే అతనిలా ఓ గ్యాంగ్ ని పెట్టాలని డిసైడ్ అయ్యే దాస్ అనే ఓ కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమా అని ఈ ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది. ట్రైలర్ లో అక్కడక్కడా బూతులు చోటు చేసుకున్నా…ప్రేమ మరియు ఫ్రెండ్షిప్ తాలూకు ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేయటం కలిసి వచ్చింది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తూ.. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
హైదారాబాద్ ఓల్డ్ సిటీలోని ఫలక్ నుమా, లాల్ దర్వాజా వంటి ప్రాంతాల్లో రూపొందించిన ఈ చిత్రంలో పెళ్ళిచూపులు, ఈ నగరానికేమైంది లాంటి చిత్రాలు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలో నటించారు.
చిత్ర నిర్మాత కరాటేరాజు మాట్లాడుతూ.. విశ్వక్‌సేన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, అతనే హీరోగా తాను ఈ సినిమాను నిర్మాంచానన్నారు.. హైదరాబాద్ లోని పాతబస్తీతో కలిపి దాదాపు 118 లోకేషన్స్ లో ఈ చిత్రం షూట్ చేశాము. ఈ చిత్రం హైదరాబాద్ బేస్డ్ స్టోరి కావటంతో ఇక్కడ నేటివిటి, కల్చర్ ని కలర్‌ఫుల్ గా చూపించాము. అని అన్నారు.