డబ్బింగ్ లో ఎన్టీఆర్ బయోపిక్

నందమూరి బాలకృష్ణ రూపొందిస్తున్న “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా షూటింగ్ ఒక వైపు నాన్ స్టాప్ గా జరుగుతుంది . ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చెయ్యబోతున్నారు . జనవరి 9 న విడుదల చేసే మొదటి భాగం మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలిసింది .

మరోవైపు ఈ సినిమాలో కొన్ని పాత్రల షూటింగ్ పూర్తి కాగానే వారితో డబ్బింగ్ కూడా చెప్పిస్తున్నారు . “ఎన్టీఆర్ బయోపిక్” చిత్రం డబ్బింగా కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో గుట్టుగా జరుగుతున్నట్టు తెలిసింది .

ఇక ఈ చిత్రం షూటింగ్ హైదెరాబాలోను, ఆంధ్ర ప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో జరుగుతుందని తెలిసింది . దర్శకుడు క్రిష్  ఈ చిత్రం విషయంలో అనేక వత్తిడిలకు గురవుతున్నా , తాను   రాజీ పడకుండా సినిమాను తీసున్నాడని చెబుతున్నారు . అందరి ద్రుష్టి ఎన్టీఆర్  బయోపిక్ మీదే వుంది .