భార్యా బాధితులుగా వెంకటేష్, వరుణ్‌తేజ్‌లు తెగ నవ్వించేసి, డబ్బులు సంపాదించేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వీరిద్దరూ హీరోలుగా నటించిన చిత్రం ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. తమన్నా, మెహరీన్ హీరోయిన్స్. భార్యల వల్ల హీరోలు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతూ ఫన్ పంచటం ప్రేక్షకులకు తెగ నచ్చేస్తోంది. సంక్రాంతికి థియేటర్‌కు వచ్చిన ఈ అల్లుళ్లు జోరుకు డిస్ట్రిట్యూటర్స్ ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు.
దాంతో ఎఫ్ 2 సినిమా టీమ్ కు ఏషియన్ సునీల్ భారీ పార్టీ ఇచ్చారు. నైజాం ఏస్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాత అయిన ఏషియన్ సునీల్ రాత్రి తన స్వంత పబ్ లో ఎఫ్ 2 టీమ్ కు భారీ పార్టీ ఇచ్చి ఖుషీ చేసారు. హీరోయిన్లు మెహరీన్, తమన్నా మినహా మిగిలిన టీమ్ అంతా ఈ పార్టీకి హాజరయ్యి, ఎంజాయ్ చేసారు. అయితే లోకల్ గా అందుబాటులో లేకపోవడంతో హీరోలు ఇద్దరూ మాత్రం రాలేదు. నిర్మాత దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు హాజరయ్యారు.
అంతేకాదు ఏషియన్ సునీల్ కు సన్నిహితులు అయిన నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, మరో నిర్మాత అభిషేక్ నామా కూడా పార్టీకి వచ్చారు. దాదాపు తెల్లవారు ఝాము వరకు పార్టీ కొనసాగిందని సమాచారం.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో హీరో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించగా.. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, రఘబాబు, నాజర్, అన్నపూర్ణ, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.