రెండు విషయాల్లో దిల్ రాజు కన్నింగ్ మైండ్..బయట పడిందా..!

Dil Raju

టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు. ఎప్పుడు నుంచో ఇండస్ట్రీలో ఉన్న తాను ఇప్పుడు పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా మారాడు. అయితే దిల్ రాజు ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశారు కానీ ఈ ఏడాది ఎదుర్కున్న నష్టాలు మాత్రం అన్ని ఇన్ని కావు.

ఎదో ఒకటి రెండు అంశాల్లో సేఫ్ అయ్యారు తప్ప ఇక మిగతా సినిమాల్లో మాత్రం భలే నష్టాలు తప్పలేదు. మరి ఈ ఫ్రస్ట్రేషన్ లో ఏమో కానీ లేటెస్ట్ గా తన చర్యలు చూసి ఇండస్ట్రీ వర్గాల వారు షాకవుతున్నారు. టాలీవుడ్ ఓ యంగ్ హీరో సినిమాని రిలీజ్ చేయనివ్వకుండా ఆపుతుండడం థియేటర్స్ మీకు దక్కవు అని బెదిరించడం వంటి షాకింగ్ అంశాలు టాలీవుడ్ లో కలకలం రేపాయి.

ఇక ఇది పక్కన పెడితే టాలీవుడ్ లో నిన్న ఆగస్ట్ 1 నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ ఆపేయాలి అని ఫిక్స్ అవ్వగా అన్ని సినిమాలు ఆపారు కానీ తాను నిర్మిస్తున్న “వారసుడు” తమిళ్ లో “వరిసు” మాత్రం ఆగలేదు. మరి దీనికి కారణం అడిగితే ఇది తెలుగు సినిమా కాదు తమిళ్ సినిమా అంటూ షాకిచ్చారు.

అసలు ఈ సినిమాతోనే విజయ్ దళపతి తెలుగులో అందులోని తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా భారీ తెలుగు తారాగణం నటిస్తున్నారు. దీనితో ఈ చిత్రం ఎలా తెలుగు సినిమా కాదు? పైగా రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న సినిమా అని కూడా తెలిపారు.

ఇప్పుడు చూస్తే దిల్ రాజు తనకి కన్వీనెంట్ గా మార్చేసుకోవడం అందరికీ షాకిచ్చింది. దీనితో దిల్ రాజు కన్నింగ్ మైండ్ ఏంటో అందరికీ అర్ధం అవుతుంది అని నెటిజన్స్ లో మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ రెండు అంశాల్లో దిల్ రాజు అసలు మైండ్ సెట్ ఏంటి అనేది అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.