బన్నికి, దిల్ రాజుకు ఉన్న అనుబంధం ఇవాళా,నిన్నటిది కాదు. బన్నికెరీర్ లో తొలి హిట్ ఆర్యని ప్రొడ్యూస్ చేసింది దిల్ రాజు. ఆ తర్వాత బన్ని, దిల్ రాజు కాంబోలో పరుగు వచ్చింది. ఆ తర్వాత దిల్ రాజు, బన్ని కలిసి దువ్వాడ జగన్నాధం సినిమా చేసారు. ఇలా వీళ్లు కలిసారంటే హిట్ ఖాయం. దాంతో మళ్లీ ఇద్దరు కలిసి ఏదన్నా సినిమా ప్లాన్ చేస్తున్నారా అనే సందేహం ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొంతకాలంగా వినపడుతోంది. తాజాగా దిల్ రాజు పని గట్టుకుని మరీ అల్లు అర్జున్ ని తీసుకుని వెళ్లి ..96 అనే తమిళ సినిమాను చూపించారు. ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయిన బన్నీ
చాలా బాగుందని చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు బన్ని ఈ సినిమా రీమేక్ లో చేస్తాడా ..అంటే కథ ప్రకారం బన్ని కు సెట్ కాదు. ఈ సినిమాలో ఏజెడ్ పర్శన్ గా కనిపించాలి. మరి ఎందుకు చూపించాడు అని జనం జుట్టు పీకేసుకుంటున్నారు. అయితే అలా అందరిలో క్యూరియాసిటీ కలిగించటానికి ఈ ప్రాజెక్టుపై క్రేజ్ క్రియేట్ చేయటానికే దిల్ రాజు ఈ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారని సీనియర్స్ ఉవాచ.
ఇంతకీ ఈ 96 కాన్సెప్టు ఏమిటి అంటే.. దాదాపు ఇరవై రెండేళ్ల ఏళ్ళ క్రితం 1996లో తమ స్కూల్ చదువు పూర్తై విడిపోయిన ఓ అమ్మాయి అబ్బాయి ఇప్పుడు కలుస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది అనేదే ఈ కాన్సెప్టు. కథ ప్రకారం హీరో హీరోయిన్లు నడి వయస్సు వాళ్లలా కనిపించాలి. ఈ గురువారమే విడుదల కాబోతున్న 96 రైట్స్ దిల్ రాజు తీసుకున్నారు.
ఈ సినిమా పై కోలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. విజయ్ సేతుపతి సరసన త్రిష మొదటిసారి నటిస్తున్న సినిమా ఇది. హిట్ అయితే రీమేక్ . యావరేజ్ అయితే డబ్బింగ్, రెండూ కాక తేడా రిపోర్ట్ వస్తే ప్రాజెక్టు పెండింగ్ ఇదే దిల్ రాజు అనుసరిస్తున్న వ్యూహం అంటున్నారు. అయితే దిల్ రాజు కు మాత్రం ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నారట. మరి హిట్ అయితే ఏ హీరోని సీన్ లోకి తెస్తారో చూడాలి.