(ధ్యాన్)
అఖిల్ తన తొలి సినిమా `అఖిల్` విషయంలో తొందరపడ్డాడా? అఖిల్ తొందరపడ్డాడో లేడో కానీ, నాగార్జున మాత్రం ఆ సినిమా గురించి పదే పదే చెబుతుంటారు. తాజాగా `దేవదాస్` సినిమా ప్రమోషన్‌లోనూ ఆ విషయాన్ని ప్రస్తావించారు. తొలి సినిమా విషయంలో `అఖిల్` తొందరపడ్డాడని అన్నారు. ఈ విషయాన్ని ఆయన బాలీవుడ్‌లో కరణ్‌జోహార్‌తో కూడా చెప్పానని అన్నారు. కరణ్‌జోహార్, అఖిల్ చాలా మంచి ఫ్రెండ్స్ అట. రెండేళ్లుగా సినిమా ప్లాన్ చేస్తున్నారట. హిందీలో అఖిల్‌ని తాను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నట్టు కరణ్ వచ్చి నాగార్జునతో చెప్పారట. `అలా వద్దు కరణ్. పెద్దలు చెప్పే మాట వినండి. తనతో ముందు తెలుగులో నేను ఓ సినిమా చేసి హిట్ కొడతాను. ఆ సినిమాను నువ్వు హిందీలో చేద్దువుగానీ`అని అన్నారట. ఈ విషయాన్నంతా నాగార్జున స్వయంగా వెల్లడించారు.