దేవి శ్రీ ప్రసాద్ లేటెస్ట్ ట్వీట్ వైరల్..అందులో ఏముందంటే

కొన్ని ట్వీట్స్ అనుకోకుండా వైరల్ అవుతాయి. కొన్ని వైరల్ అవటానికే ట్వీట్స్ అవుతాయి. అయితే అలాంటి ట్వీట్స్ అన్నీ సెలబ్రెటీల కిట్టీలోనే ఉంటాయి. ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ వంటి స్టార్ మ్యూజిక్ డైరక్టర్ ట్వీట్స్ పై అందరి దృష్టీ ఉంటుంది. అలాంటిది ఆయన యూత్ లో క్రేజ్ ఉన్న కేటీఆర్ గురించి ట్వీట్ చేస్తే ఇంకేమైనా ఉందా..అభిమానులు ఊరుకుంటారా..రీట్వీట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేసేయరూ..ఇప్పుడు అదే జరుగుతోంది..

సినిమావాళ్లు ,రాజకీయ నాయకులు కలిసి మెలిసి తిరుగుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ కు సినిమా వాళ్లతో మంచి రిలేషన్ ఉంది. సినిమాలు చూసి ఆయన ట్వీట్స్ కూడా చేస్తూంటారు. ప్రజాజీవితాన్ని ప్రతిబింబించే సినిమాలను ఆయన ప్రమోట్ చేయటంపై ఆసక్తి చూపిస్తూంటారు. ఈ నేపధ్యంలో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో మారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత కే తారక రామారావుకు సినీ ప్రముఖల నుంచి అభినందనలు అందుతున్నాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అభినందనలు తెలిపారు.ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను ఉంచారు. “ఆల్ ది వెరీ బెస్ట్ డియర్ బ్రదర్ (సర్)!… ఎప్పటిలానే… యూ విల్ రాక్” అని వ్యాఖ్యానించారు. అంతకుముందు తాను నామినేషన్ వేసిన సందర్భంగా తీసిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేసిన కేటీఆర్… తనకు ఆశీస్సులు, అభినందనలు కావాలని కోరిన సంగతి తెలిసిందే. దానిపై దేవి శ్రీ ప్రసాద్ స్పందించగా, ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ దేవీశ్రీ కిట్టీలో ఉన్నాయి. తెలుగులో ఉన్న స్టార్లందరూ దేవినే మ్యూజిక్ డైరెక్టర్ గా కావాలంటున్నారు ఈ రాక్ స్టార్ మ్యూజిక్ ఇస్తే చాలు ఆల్బమ్ సూపర్ హిట్ అవుతుందని.. తద్వారా సినిమా సగం హిట్ అయిపోయినట్టే అని భావిస్తున్నారు మన మేకర్స్.