మందు గ్లాస్..మంచు లక్ష్మి ప్రశ్న,నాగ్ జవాబు

కొన్ని ఇంటర్వూలు చూస్తూంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకీ ప్రశ్న అడిగారా అని డౌట్ వస్తుంది. తాజాగా అలాంటి డౌటానుమానమే… దేవదాస్’ టీంను మంచు లక్ష్మీప్రసన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు జనాలకు కలిగింది. దేవదాస్’చిత్రం ప్రమోషన్ లో భాగంగా మంచు లక్ష్మి నాగ్ ని ఇంటర్వూ చేసింది.   ఇంటర్వూ అంతా ఒకెత్తు..అందులో మందు  తాగటం గురించి నాగ్ ని అడిగిన ప్రశ్న ఒకెత్తు. ఆయన సమాధానం మరొక ఎత్తు..అదేమిటంటే..

మంచు లక్ష్మి .. ‘‘ దేవదాసు సినిమాలో మీరెప్పుడూ చేతిలో మందు గ్లాసులో ఉంటారని విన్నాను. షూటింగ్ టైంలో నిజంగానే మందు కొట్టారా’’ అని లక్ష్మి ప్రశ్నించింది..  ఆ ప్రశ్నకు నాగార్జున సమాధానమిస్తూ ‘‘అవును,నిజమే  సాయంత్రం షూటింగ్ ఉన్నపుడు కొంచెం కొంచెం మందు సిప్ చేసేవాడిని’’ అన్నారు.

షూటింగ్ లో ఆయన మందు కొట్టాడనే జనరల్ నాలెడ్జ్ క్వచ్చిన్ ఎందుకు మంచు లక్ష్మి అడిగిందో… ఆమెకే తెలియాలి అంటున్నారు ఆ పోగ్రాం చూసిన జనం. ఇది విన్న నాని..‘‘నాకు చెప్పుంటే నేను కూడా జాయిన్ అయ్యేవాడిని కదా’’ అంటూ నాని కామెంట్ చేసాడు. ఇదంతా బాగానే ఉంది కానీ సినిమా కూడా చూడకుండా మంచు లక్ష్మి…ఇంటర్వూకు కూర్చోవటం ఏమిటి.