మ‌మ్మీ కాబోతున్న మ‌రో అందాల హీరోయిన్

దీప్‌వీర్ పేరెంట్స్ కాబోతున్నారా?

సోష‌ల్ మీడియా ద్వారా స్టార్స్ త‌మ అభిమానుల‌కు చేరువ‌గా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఫాలోవ‌ర్స్ ని పెంచుకునేందుకు నిరంత‌రం త‌మ లేటెస్ట్ సినిమాల‌ అప్‌డేట్స్‌తో పాటు కొత్త సినిమాల‌కు సంబంధించిన ర‌క‌ర‌కాల విష‌యాల్ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో త‌మ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆ కోవ‌లోనే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే బాలీవుడ్ క్రేజీ స్టార్ దీపికా ప‌దుకొనే ఇటీవ‌ల ఇఫా 2019 గ్రీన్ కార్పేట్‌పై హోయ‌లొలికించింది.  ప్ర‌ముఖ డిజైన‌ర్ గౌర‌వ్ గుప్తా డిజైన్ చేసిన వ‌యోలెట్‌ క‌ల‌ర్ ఔట్ ఫిట్‌లో దీపిక మెరిన తీరు అంద‌రిని ఆక‌ట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోల‌ని దీపిక అభిమానుల‌తో సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది.

ఈ ఫొటోలు చూసిన ర‌ణ్‌వీర్‌సింగ్ బేబీ నీ అందంతో చంపేస్తున్నావ్‌ అని కామెంట్ చేస్తే అభిమానులు మాత్రం దీపికలో వేరొక కొత్త కోణాన్ని క‌నిపెట్టేశారు. ఆమె ప్రెగ్నెంటా? అని సోష‌ల్ మీడియాల్లో కాంమెంట్లు చేస్తున్నారు. దీనికి దీపిక కూడా బ‌దులిస్తూ బేబీ ఎమోజీల‌ని, ల‌వ్ సింబ‌ల్స్‌ని పోస్ట్ చేయ‌డంతో అభిమానుల హంగామాకు హ‌ద్దే లేకుండా పోయింది. దీంతో మ‌రింత రెచ్చిపోయిన ఫ్యాన్స్ దీప్‌వీర్ పేరెంట్స్ కాబోతున్నారంటూ ఓ రేంజ్‌లో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టారు. దీనికి అర్జున్ క‌పూర్ ఫినిషింగ్ ట‌చ్ ఇస్తూనే బాబా బాబీ మీ కోసం మ‌రొక‌రిని సిద్ధం చేస్తున్నాం అంటూ చెప్ప‌డంతో అభిమానుల ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది.