పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ఆయన 21వ చిత్రం `మహానటి` ఫేం నాగ్ అశ్విన్ దర్శతకత్వంలో తెరకెక్కుతు న్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఓవైపు ప్రచారం ఠారెత్తిపోతుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ పై ఆసక్తి నెలకొంది. సినిమా ప్రకటనే అప్పట్లో పెద్ద షాకింగ్. తదుపరి ఒక్కోక అప్ డేట్ సినిమాపై బజ్ ని ఓ రేంజ్ లో క్రియేట్ చేసింది. తాజాగా శనివారం చిత్ర యనిట్ ఆదివారం ఓ సర్ ప్రైజ్ ఇబ్బబోతున్నట్లు ట్వీట్ చేసింది.
దీంతో ఆ సర్ ప్రైజ్ ఏంటి? ఎలా ఉంటుందన్న? ఒకటే క్యూరియాసిటీ అభిమానులు సహా ప్రేక్షకుల్లో నెలకొంది. తాజాగా ఆసర్ ప్రైజ్ ని యూనిట్ కొద్ది సేపటి క్రితమే రివీల్ చేసింది. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణేని ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రకనతో అంచనాలు ఆకాశాన్నే అంటుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్! అసలు ఊహించని సర్ ప్రైజ్ ఇది అనే అనాలి. దీపికా పదుకోణేని టాలీవుడ్ లో లాంచ్ చేయాలని ఇక్కడి స్టార్ దర్శకులు చాలా మంది ప్రయత్నించారు. హీరోలు కూడా ఆమెతో కలిసి నటించాలని ఆశపడ్డారు.
ఇందులో స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా ఉన్నారు. కానీ వాళ్లెవ్వరికి సాధ్యం కానిది నాగ్ అశ్విన్ చేసి చూపించాడు. ఆ ఛాన్స్ ప్రభాస్ కొట్టేసాడు. నిజంగా ఈ వార్త షాకింగే. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.స్ర్కిప్ట్ సోషియా పాంటసీ నేపథ్యంతో కూడుకున్నదని ఇప్పటికే ప్రచారంలోకి వచ్చింది. పైగా చిరంజీవి రిజెక్ట్ చేసిన స్ర్కిప్ట్ అని కూడా వెలుగులోకి వచ్చింది. మరి ఇందులో వాస్తవం ఎంత? అసుల స్ర్కిప్ట్ స్వరూపం? ఏంటన్నది అధికారికంగా రివీల్ చేస్తే గానీ తెలియదు.