రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్న 21వ చిత్రం హీరోయిన్గా బాలీవుడ్ నటి దీపికా పుదకొణెని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఆదివారం చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లో ప్రభాస్ 21 హీరోయిన్ దీపిక అంటూ ప్రచారం ఠారెత్తిపోతుంది. అన్ని వెబ్ సైట్లు, పత్రికలు సైతం ఇలాగే ఫోకస్ చేసాయి. దీంతో దీపిక ఇలా ప్రచారం చేయడంపై మండిపడ్డింది. ప్రభాస్ 21 హీరోయిన్ ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అవకాశం వచ్చినందుకు థ్రిల్లింగ్ కి మించి ఫీలవుతున్నా. అద్భుతమైన జర్నీ కోసం ఎదురుచూస్తున్నా.
ఈ సినిమా టైటిల్ `ప్రభాస్ 21` కాదు. ప్రభాస్ నటించే 21వ చిత్రం. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. దీన్ని నోట్ చేసుకోండి అంటూ దీపిక కామెంట్ పెట్టారు. దీంతో ప్రభాస్ అభిమానులు, తెలుగు ఆడియన్స్ రివర్స్ అవుతున్నారు. టైటిల్ పెట్టే వరకూ దాన్ని ప్రభాస్ 21 గానే పిలుస్తారని, పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ..అంతకు ముందు ఇది ఓ తెలుగు చిత్రం… ప్రభాస్ తెలుగు రాష్ర్టంలో..తెలుగు భాషలో పుట్టి పెరిగిన వ్యక్తి. తెలుగు ప్రజలు ఆయన్ని నటుడిని చేసింది. మా అభిమాన హీరోని ఎలాగైనా పిలుచుకునే హక్కు మాకుందంటూ కౌంటర్లు వేస్తున్నారు.
ఏది సినిమా టైటిల్? ఎవరు హీరోయిన్ అన్నది! మాకు తెలుసంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మొత్తానికి అమ్మడు వచ్చి రాగానే వివాదంతో టాలీవుడ్ లో అడగు పెట్టబోతుంది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సన్నివేశం ఇది. ఆ విషయం పక్కనబెడితే దీపిక ఎంట్రీతో ఈ సినిమా స్థాయే మారిపోయింది. ప్రభాస్-దీపికను ఒకే ప్రేమ్ లో ఊహించుకోవడం అభిమానులకు పండగలా ఉంది. ఈ చిత్రాన్ని `మహానటి` దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. మహానటి తర్వాత ఈ సినిమా స్ర్కిప్ట్ పైనే వర్క్ చేసి పాన్ ఇండియా రేంజ్ కథని సిద్దం చేసాడు.
https://twitter.com/deepikapadukone/status/1284809887004995584?s=19