దారుణం: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీ ఛార్జ్
విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్, ఇమేజ్ మాములూగా లేదు. మేము చెప్పేది కేవలం తెలుగులోనే కాదు మిగిలిన భాషల్లో కూడా అదే పరిస్దితి. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ హీరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్తుతుంది. మిగతా హీరోలు అసూయతో రగిలిపోయే స్టేజీలో ఉన్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు.
ఈ చిత్రం జులై 26న విడుదల కానుంది. ఈ నేఫద్యంలో ప్రమోషన్స్ జోరు పెంచేసాడు. డియర్ కామ్రేడ్ నాలుగు దక్షిణాది భాషల్లోనూ విడుదలవుతుంది కాబట్టి. ప్రతీ రాష్ట్రంలో తిరిగి మ్యూజికల్ ఈవెంట్స్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే బెంగళూర్, కొచ్చిలలో ఓ భారీ ఈవెంట్స్ పూర్తి చేసాడు విజయ్. ఈవెంట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ కార్యక్రమంలో సరైన ప్లానింగ్ లేకపోవటంతో సమస్యలు వచ్చి పడ్డాయి. ఎంతమంది వస్తారో సరిగ్గా సినిమా టీమ్ అంచనా వేయకపోవటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అభిమానులు భారీగా రావడం.. వాళ్లకు పాసులు అందించడంలో ఈవెంట్ మేనేజర్లు ఫెయిల్ అవటంతో రచ్చ అయిపోయింది. ఈ పాసుల కోసం అభిమానులు ఆడిటోరియం బయట నానా గోల చేస్తుంటే వాళ్లను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.
లాఠీ ఛార్జి విషయం తెలుసుకుని బయటికి వచ్చిన విజయ్ దేవరకొండను పట్టుకుని ఫ్యాన్స్ కన్నీరు పెట్టుకుంటున్నారు. వాళ్లను ఓదారుస్తూ విజయ్ ఇలాంటి సిట్యువేషన్ వచ్చినందుకు బాధపడ్డారు. జులై 18, 19న చెన్నై, హైదరాబాద్‌లలో జరగబోయే ఈవెంట్స్‌లో ఇలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని మేనేజర్స్‌ను కోరాడు విజయ్.