సౌత్‌లో మంచి హిట్ సాధించిన చాలా చిత్రాలు ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్నాయి. తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రాన్ని బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు . రీసెంట్‌గా విజయ్ తో పాటు చిత్ర నిర్మాతలతో కలిసి చిత్రాన్ని వీక్షించిన ఆయన ఇదొక గొప్ప ప్రేమ కథ. మంచి సందేశం ఉంది. నటీనటులతో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి. ధర్మ ప్రొడక్షన్స్ సంస్థపై ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాననే విషయం తెలపడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. దఢఖ్ పెయిర్ ఇషాన్, జాన్వీ కపూర్ రీమేక్ చిత్రంలో హీరో హీరోయిన్‌లుగా నటిస్తారని సోషల్ మీడియాలో పలు వార్తలు పుట్టుకొస్తున్నాయి . దఢఖ్ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి ప్రశంసలు లభించడంతో కరణ్ జోహార్ డియర్ కామ్రేడ్ రీమేక్ చిత్రంలో వారిద్దరిని ఎంపిక చేశాడని అంటున్నారు.
జూలై 26న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన విషయం విదితమే.